Raj Kundra Arrest: నటి శిల్పాశెట్టి భర్త, పారిశ్రామిక వేత్త రాజ్ కుంద్రాను అరెస్టు చేసిన ముంబయి పోలీసులు.. ఎందుకంటే..

Raj Kundra Arrest
Share

Raj Kundra Arrest: ప్రముఖ పారిశ్రామిక వేత్త, బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాను ముంబయి పోలీసులు అరెస్టు చేయడం  బాలివుడ్ వర్గాల్లో తీవ్ర సంచలన వార్త అయ్యింది. సోమవారం రాత్రి కుంద్రా ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోర్న్ వీడియోలను చిత్రీకరించి కొన్ని మొబైల్ యాప్స్ ద్వారా ప్రసారం చేస్తున్నారన్న అభియోగంపై రాజ్ కుంద్రాను పోలీసులు అరెస్టు చేశారు. దీనికి సంబంధించి కీలక ఆధారాలు పోలీసుల వద్ద ఉన్నట్లు సమచారం. పూర్తి వివరాలు సేకరించేందుకు కుంద్రాను అదుపులోకి తీసుకున్నట్లు ముంబయి పోలీసులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి రాజ్ కుంద్రాతో సహా 11 మందిని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.

Raj Kundra Arrest
Raj Kundra Arrest:

ఫోర్న్ వీడియోలను యాప్ ద్వారా విడుదల చేస్తున్నారన్న అరోపణలపై రాజ్ కుంద్రా పై గత ఫిబ్రవరి నెలలోనే కేసు నమోదు అయ్యింది. ఈ వ్యవహారంలో ఆయన ప్రధాన పాత్ర పోషించారని పక్కా అధారాలు లభించడంతో అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు రాజ్ కుంద్రాను విచారణ జరిపి విడుదల చేస్తారా లేక అరెస్టు చూపి కోర్టుకు హజరు పరుస్తారా అనే వివరాలు తెలియాల్సి ఉంది. మొబైల్ యాప్ లలో విడుదల చేస్తున్న వీడియోలకు రాజ్ కుంద్రా నిర్మాతగా వ్యవహరిస్తున్నారని పోలీసులు ఆరోపిస్తున్నారు.


Share

Related posts

దాస‌రి త‌న‌యుడు వ‌చ్చేశాడు

Siva Prasad

మొలలు వ్యాధి ఉన్నవారు తీసుకోవాలిసిన  జాగ్రత్తలు!!

Kumar

డిప్యూటీ సీఎం అయి ఉండి బూతులు మాట్లాడుతారా? అదేనా సంస్కారం

Varun G