రాజస్థాన్ హైకోర్టు జైపూర్ వరుస పేలుళ్ల కేసులో సంచలన తీర్పు వెల్లడించింది. ఉరి శిక్ష పడిన నలుగురు నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పు ఇచ్చింది. 2008 లో జైపూర్ జరిగిన వరుస పేలుళ్ల ఘటనలో 71 మంది మరణించగా, 180 మంది గాయపడ్డారు. ఈ కేసుకు సంబంధించి 2019 లో నలుగురు నిందితులు మహమ్మద్ సల్మాన్, మహమ్మద్ సైఫ్, సర్వార్ జజ్మీ, సైఫురెహ్మాన్ అన్సారీ లకు ట్రయల్ కోర్టు మరణ శిక్ష విధించింది. జస్టిస్ పంకజ్ భండారీ, జస్టిస్ సమీర్ జైన్ తో కూడిన డివిజన్ బెంచ్ 28 అప్పీళ్లను ఆమోదించి ఈ మేరకు తీర్పు వెల్లడించింది. ఈ కేసులో నిందితుల్లో ఒకరిని నిర్దోషిగా ప్రకటించిన దిగువ కోర్టు తీర్పును సమర్ధించింది.

2008 మే 13న జైపూర్ వరుస పేలుళ్లతో ఉలిక్కిపడింది. ఈ ఘటనల్లో మొత్తం 71 మంది మృత్యువాత పడగా, 180 మందికిపైగా గాయాలపాలైయ్యారు. ఓ సైకిల్ పై ఉన్న స్కూల్ బ్యాగ్ లో లైవ్ బాంబు కూడా లభ్యమైంది. ఈ కేసు దర్యాప్తు చేసిన పోలీసులు మొత్తం 13 మంది నిందితులను అరెస్టు చేశారు. ఎనిమిది ఎఫ్ఐఆర్ లు నమోదు అయ్యాయి. ఈ కేసుల్లో 1,293 మంది సాక్షులను విచారించారు. నిందితుల్లో ముగ్గురు హైదరాబాద్, ఢిల్లీ జైలులో ఉన్నారు. మరో ముగ్గురు ఇప్పటికీ పరారీలో ఉన్నారు. ఇద్దరు బత్లా హౌస్ ఎన్ కౌంటర్ లో హతమైయ్యారు. నలుగురు జైపూర్ జైలులో ఉన్నారు.
వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తు లో కీలక మలుపు.. డిఐజీ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసిన సీబీఐ