NewsOrbit
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

Rajinikanth : బిగ్ బ్రేకింగ్.. తలైవాకు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు..

Rajinikanth : సూపర్ స్టార్ రజనీకాంత్ కు కేంద్రం దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును ప్రకటించింది. ఈ రోజు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్ జవడేకర్ ఈ అవార్డు విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. 2019 సంవత్సరానికి గానూ రజనీకాంత్ 51వ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అందుకోనున్నారు. తలైవా దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుకు  ఎంపిక కావడంతో అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా తలైవాకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ సందర్భంలోనే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తన ట్విట్టర్ ద్వారా రజనీకాంత్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. వైవిద్యమైన పాత్రలలో తరతరాలుగా ప్రేక్షకులన అలరిస్తూ వస్తున్న తలైవాకు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించడం సంతోషంగా ఉంది. మీకు నా అభినందనలు అంటూ మోడి ట్వీట్ చేశారు. ఏపి సీఎం వైఎస్ జగన్ కూడా రజనీకి శుభాకాంక్షలు తెలిపారు.

Rajinikanth dada saheb phalke award
Rajinikanth dada saheb phalke award

తమిళనాట ఎన్నికల వేళ ఓటర్లను ఆకట్టుకునేందుకు కేంద్రంలోని బీజేపీ ఈ ఎత్తుగడ వేసిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నాారు. తమిళనాడులో రజనీకి విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. దాన్ని ఈ ఎన్నికల వేళ క్యాష్ చేసుకునేందుకు కేంద్రంలోని బీజేపీ వ్యూహాత్మకంగా రజనీకి ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటన చేసిందనే మాట వినిపిస్తోంది. ప్రస్తుతం తమిళనాడు డీఎంకే, అన్నా డీఎంకే మధ్య హోరాహోరీ పోరు నడుస్తున్నది. వివిధ సంస్థల ఓపీనియన్ పోల్స్ డీఎంకేకి అనుకూలంగా వెల్లడి అవుతున్నాయి. తమిళనాడులో బీజేపీకి బలమైన నాయకత్వం, క్యాడర్ లేకపోవడంతో అన్నా డీఎంకేతో పొత్తుతో రంగంలో ఉంది. బీజేపీ ఎత్తుగడ ఫలిస్తుందో లేదో వేచి చూడాలి.

author avatar
sharma somaraju Content Editor

Related posts

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

Lok sabha Elections 2024: నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల .. ఏపీ, తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం

sharma somaraju

వైసీపీలో ఆ ఇద్ద‌రి సీట్లు పీకేస్తోన్న జ‌గ‌న్‌… రోజా బ్యాడ్ ల‌క్ అంతే..?

Nabha Natesh: మాట‌లు జాగ్ర‌త్త‌.. ప్రియ‌ద‌ర్శికి న‌భా న‌టేష్ స్ట్రోంగ్ వార్నింగ్.. అంత పెద్ద తప్పు ఏం చేశాడు?

kavya N

మాకు బీ ఫామ్‌లు వ‌ద్దు… ప‌వ‌న్‌ను చివ‌రి వ‌ర‌కు టెన్ష‌న్ పెట్టిన జ‌న‌సేన క్యాండెట్లు…!

Nuvvu Nenu Prema April 18 2024 Episode 601: విక్కీని కొట్టి పద్మావతిని కిడ్నాప్ చేసిన కృష్ణ.. అనుతో దివ్య గొడవ.. పద్మావతిని శాశ్వతంగా దూరం చేసిన కృష్ణ..

bharani jella

AP Elections 2024: రేపటి నుండి నామినేషన్లకు రంగం సిద్దం – సీఈవో ముకేశ్ కుమార్ మీనా

sharma somaraju

Inter Board: ఏపీ ఇంటర్ బోర్డు కీలక ప్రకటన .. రీ వెరిఫికేషన్, బెటర్మెంట్ ఫీజు చెల్లింపునకు పూర్తి సమాచారం ఇది

sharma somaraju

Chandrababu: ప్రభుత్వంపై చంద్రబాబు కీలక ఆరోపణ ..ఆ కేసు దర్యాప్తు ఈసీ పర్యవేక్షణలో జరగాలి

sharma somaraju

Janasena: అభ్యర్ధులకు బీఫామ్ లు అందజేసిన పవన్ కళ్యాణ్

sharma somaraju

Chiyaan Vikram: సీరియ‌ల్ యాక్ట‌ర్‌ నుంచి స్టార్ హీరోగా విక్ర‌మ్ ఎలా ఎదిగాడు.. అత‌ని భార్య‌, కూతురిని ఎప్పుడైనా చూశారా?

kavya N

Tollywood Actor: ఈ ఫోటోలో ఉన్న స్టార్ హీరోను గుర్తుప‌ట్టారా.. రీల్ లైఫ్‌లోనే కాదు రియ‌ల్ లైఫ్‌లో కూడా ల‌వ‌ర్ బాయే!

kavya N

Sri Rama Navami: భద్రాద్రిలో వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణం

sharma somaraju

NTR: ఎన్టీఆర్ పాతికేళ్ల క‌ల దేవ‌రతో అయినా నెరవేరుతుందా..?

kavya N

Sri Ramadasu: భక్తిరస మహాకావ్యం శ్రీరామదాసు సినిమా గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?

kavya N