NewsOrbit
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

తమిళనాడు జైళ్ల నుండి విడుదలైన రాజీవ్ గాంధీ హత్య కేసు దోషులు.. ఆ దోషులు శరణార్ధుల శిబిరానికి

సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసు లో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న నళిని, ఆమె భర్త శ్రీహరన్ అలియాస్ మురుగన్ సహా ఆరుగురు దోషులు తమిళనాడు జైళ్ల నుండి శనివారం విడుదల అయ్యారు. ప్రస్తుతం పెరోల్ పై ఉన్న నళిని తను శిక్ష అనుభవిస్తున్న వెల్లూరులోని ప్రత్యేక మహిళా కారాగారానికి వెళ్లి విడుదలకు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేశారు. అక్కడి నుండి వెంటనే వెల్లూరు సెంట్రల్ జైలుకు చేరుకుని విడుదలైన తన భర్త వి శ్రీహరన్ (మురగన్) ను చూసి భావోద్వేగానికి గురైయ్యారు.

Nalini Sriharan

 

మురుగన్, సంథన్ లు సెంట్రల్ జైలు నుండి విడుదల కాగానే వారు శ్రీలంక దేశస్తులైనందున పోలీసు వాహనంలో వారిని తిరుచిరాపల్లి ప్రత్యేక శరణార్ధుల శిబిరానికి తరలించారు. శ్రీలంక దేశస్తులైన మరో ఇద్దరు దోషులు రాబర్ట్ పాయస్, జయకుమార్ చెన్నైలోని పుజల్ సెంట్రల్ జైలు నుండి విడుదల కాగా వారిని కూడా తిరుచిరాపల్లిలోని ప్రత్యేక శరణార్ధుల శిబిరానికి తరలించారు. ఈ నలుగురిని అక్కడ ఉంచనున్నారు. వీరిని స్వదేశం శ్రీలంక పంపే విషయంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నది. కాగా నళిని చెన్నైలో ఉంటారా లేక లండన్ లోని తన కుమార్తె వద్దకు వెళ్తారా అనేది ఇంకా తెలియరాలేదు.

Nalini Sriharan

మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ హత్య కేసులో ఏడుగురు దోషులు 30ఏళ్లకు పైగా జైలు శిక్ష అనుభవించారు. ఈ కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న పెరారివాలన్ ను రాజ్యాంగంలోని 142వ అధికరణ కింద దఖలు పడిన అసాధారణ అధికారులను ఉపయోగించి సుప్రీం కోర్టు ఈ ఏడాది మే 18న విడుదలకు ఆదేశాలు జారీ చేసింది. అదే తీర్పు మిగిలిన ఆరుగురు దోషులకు వర్తిస్తుందని శుక్రవారం జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ బివి నాగరత్నల నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేస్తూ విడుదలకు ఉత్తర్వులు ఇచ్చింది.

author avatar
sharma somaraju Content Editor

Related posts

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju