NewsOrbit
జాతీయం న్యూస్

రాజ్యసభలో ఆందోళనలు .. 19 మంది విపక్ష ఎంపీలపై సస్పెన్షన్ వేటు

నిన్న లోక్ సభలో నలుగురు పార్లమెంట్ సభ్యులపై సస్పెన్షన్ వేటు పడగా, ఈ రోజు రాజ్యసభలో విపక్షాలకు చెందిన 19 మంది సభ్యులను సస్పెండ్ చేశారు డిప్యూటి చైర్మన్ హరివంశ్ నారాయణ్. నిరసనలతో గందరగోళం సృష్టిస్తూ సభా కార్యకలాపాలకు అంతరాయం కల్గిస్తున్న నేపథ్యంలో 19 మంది సభ్యులకు రాజ్యసభ డిప్యూటి చైర్మన్ హరివంశ్ నారాయణ్ సస్పెన్షన్ వేటు వేశారు. ఈ వారం చివరి వరకూ వీరిపై సస్పెన్షన్ కొనసాగుతుందని ప్రకటించారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి మురళధరన్ ఈ సస్పెన్షన్ తీర్మానం ప్రవేశపెట్టారు. డిప్యూటి చైర్మన్ ఈ తీర్మానం ఆమోదం పొందినట్లు ప్రకటించారు. సస్పెండ్ అయిన సబ్యులు తక్షణమే సభ ను వీడాలని సూచించారు. సభను తొలుత 20 నిమిషాలు వాయిదా వేశారు డిప్యూటీ చైర్మన్.

 

సస్పెండ్ అయిన సభ్యుల్లో సుస్మితా దేవ్, శాంతను సేన్, కనిమొళి, మౌసుమ్ నూర్, శాంతా ఛెత్రీ, నదుముల్, రహీమ్, గిరిరాజన్, వద్దిరాజు రవి, దామోదరావు, లింగయ్య యాదవ్ ఉన్నారు. సస్పెండ్ అయిన టీఎంసీకి చెందిన ఏడుగురు, డీఎంకే కి చెందిన ఆరుగురు, సీపీఎంకు చెందిన ఇద్దరు, సీపీఐ ఎంపి ఒకరు, టీఆర్ఎస్ ఎంపీలు ముగ్గురు ఈ వారం వరకు సభకు హజరుకావద్దని ఆదేశించారు. అయితే సస్పెండ్ అయిన సభ్యులు సభను వీడకుండా అక్కడే నిరసనకు దిగారు. నినాదాలు చేస్తూ కార్యకలాపాలకు ఆటంకం కల్గిస్తున్నందున సభను మరో గంట పాటు వాయిదా వేస్తున్నట్లు డిప్యూటి చైర్మన్ ప్రకటించారు.

పార్లమెంట్ వర్షాకాల సమవేశాల్లో భాగంగా ఉభయ సభల్లో విపక్షాలు ఆందోళనలు కొనసాగిస్తున్నాయి. ధరల పెరుగుదల, నిత్యావసర వస్తువులపై జీఎస్టీ వంటి అంశాలను వ్యతిరేకిస్తూ విపక్షాలు నిరసనలు చేస్తున్నాయి. దీంతో ఉభయ సభల కార్యకలాపాలు స్తంభిస్తున్నాయి. మంగళవారం కూడా రాజ్యసభ ప్రారంభం కాగానే విపక్ష సభ్యులు ఆందోళనలకు దిగారు. సభ్యుల ఆందోళనల నడుమ చైర్మన్ ప్రశ్నోత్తరాల సమయం చేపట్టారు. అయినప్పటికీ ఎంపీలు వెల్ లోకి దూసుకువెళ్లి నినాదాలు చేశారు. దీంతో సభ పలు మార్లు వాయిదా పడింది. చివరకు 19 మంది సభ్యులను సస్పెండ్ చేశారు డిప్యూటి చైర్మన్. అటు లోక్ సభలోనూ ఇదే పరిస్థితులు నెలకొన్నాయి.

కాగా లోక్ సభలో సోమవారం నలుగురు కాంగ్రెస్ ఎంపిలపై సస్పెన్షన్ వేటు పడిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ ఎంపీలు మాణిక్యం ఠాగూర్, జి ఎన్ ప్రతాపన్, జోతిమణి, రమ్యా హరిదాస్ లను వర్షాకాల సమావేశాలు ముగిసే వరకూ సస్పెండ్ చేస్తూ సభాపతి ప్రకటించారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తీర్మానాన్ని ప్రవేశపెట్టగా, సభ ముజువాణి ఓటుతో స్పీకర్ ఆమోదించింది.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Love Guru OTT: ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తున్న విజయ్ ఆంటోనీ ” లవ్ గురు “.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Doordarshan: డీడీ న్యూస్ లోగో రంగు మార్పుపై రేగుతున్న దుమారం

sharma somaraju

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?