NewsOrbit
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

Rajya Sabha Polls: రాజస్థాన్ రాజ్యసభ ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్ ..! చివరి క్షణంలో మీడియా మొఘల్ సుభాశ్ చంద్రను బరిలోకి దింపిన బీజేపీ

Rajya Sabha Polls: రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో రాజస్థాన్ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. రాష్ట్రం నుండి నాలుగు స్థానాలకు ఎన్నికలకు జరుగుతుండగా అయిదుగురు నామినేషన్లు దాఖలు చేయడంతో రాజస్థాన్ రాజకీయాలు మరో సారి రసవత్తరంగా మారాయి. ముకుల్ వాస్నిన్, ప్రమోద్ తివారీ, రణ్ దీప్ సుర్జేవాలా కాంగ్రెస్ తరుపున పోటీ చేస్తుండగా, బీజేపీ తరపున ఘన్ శ్యామ్ తివారీ నామినేషన్ దాఖలు చేశారు. అయితే బీజేపీ మద్దతుతో స్వతంత్ర అభ్యర్ధిగా మీడియా మొఘల్ జీ నెట్ వర్క్ అధినేత, ఎస్సెల్ గ్రూపు చైర్మన్ సుభాశ్ చంద్ర అనూహ్యంగా చివరి రోజైన మంగళవారం నామినేషన్ దాఖలు చేయడం ఆసక్తికరంగా మారింది.

Rajya Sabha Polls Subhash Chandra files nomination as independent backed by bjp in Rajasthan
Rajya Sabha Polls Subhash Chandra files nomination as independent backed by bjp in Rajasthan

Rajya Sabha Polls: బీజేపీకి 11, కాంగ్రెస్ కి 15 ఓట్లు అవసరం

రాజస్థాన్ లో నాలుగు రాజ్యసభ స్థానాలు ఉండగా కాంగ్రెస్ మూడు, బీజేపీ ఒకటి గెలిచే పరిస్థితి ఉంది. అయిదవ అభ్యర్ధిగా సుభాష్ చంద్ర ఎంట్రీ ఇవ్వడంతో నాలుగో సీటుకు పోటీ నెలకొంది. 200 స్థానాలు ఉన్న రాజస్థాన్ లో రాజ్యసభ అభ్యర్ధి గెలిచేందుకు ఒకొక్కరికి 41 ఓట్లు అవసరం.   కాంగ్రెస్ పార్టీకి 108 మంది ఎమ్మెల్యేలు ఉండగా, బీజేపీకి 71 ఓట్లు (ఎమ్మెల్యేలు) ఉన్నారు. బీజేపీ ఒక అభ్యర్ధిని నిలపగా ఇంకా 30 ఓట్లు (ఎమ్మెల్యే) అదనంగా ఉన్నాయి. మరో బీజేపీ మద్దతు అభ్యర్ధి గెలవాలంటే 11 ఓట్లు అవసరం. కాంగ్రెస్ మూడవ అభ్యర్ధి గెలవాలంటే 15 మంది ఎమ్మెల్యేలు అవసరం. ఈ నేపథ్యంలో స్వతంత్ర ఎమ్మెల్యేలు, చిన్న పార్టీ ఎమ్మెల్యేల ఓట్లు కీలకం కానున్నాయి. రాజస్థాన్ అసెంబ్లీలో ఉన్న 13 మంది స్వతంత్ర ఎమ్మెల్యేలు, రాష్ట్రీయ లోక్ తాంత్రిక్ పార్టీ (ఆర్ఎల్పీ) ఎమ్మెల్యేలు ఇద్దరు, భారతీయ ట్రైబల్ పార్టీ (బీటీపీ) ఎమ్మెల్యేలు ఇద్దరు , సీపీఎం 1, సీపీఐ 1 ఎమ్మెల్యేలు మూడవ రాజ్యసభ అభ్యర్ధి ఎన్నికకు డిసైడింగ్ ఫ్యాక్టర్ కానున్నారు.

Read More: Breaking: టీడీపీకి దివ్యవాణి బిగ్ షాక్..పార్టీకి రాజీనామా

 

స్థానికేతర అభ్యర్ధులపై కాంగ్రెస్ శ్రేణుల్లో అసమ్మతి

రాజస్థాన్ అధికార కాంగ్రెస్ లో సీఎం అశోక్ గెహ్లాట్ వర్సెస్ సనిచ్ పైలట్ వైరం నడుస్తున్న నేపథ్యంలో బీజేపీ వ్యూహాత్మక ఎత్తుగడ వేసింది. ఇతర రాష్ట్రాలకు చెందిన నేతలను కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్ధులుగా ఎంపిక చేయడం పట్ల ఆ పార్టీ ఎమ్మెల్యేలే అసమ్మతి వ్యక్తం చేస్తున్నారు. రాజస్థాన్ లో చాలా మంది నాయకులు ఉండగా ఇతర రాష్ట్రాల వారికి ఎందుకు అవకాశం ఇస్తున్నారని మండిపడుతున్నారు. సీఎం అశోక్ గెహ్లాట్ సలహాదారుడు, స్వతంత్ర ఎమ్మెల్యే సన్యం లధా ఈ విషయంపై బాహాటంగానే విమర్శలు గుప్పించిన నేపథ్యంలో బీజేపీ ఇదే అవకాశంగా తమ అభ్యర్ధి ఘన్ శ్యామ్ తివారీతో పాటు మరో అభ్యర్ధిని కూడా బరిలోకి దింపుతామని ప్రకటించింది. ఈ క్రమంలోనే సుభాష్ చంద్రకు మద్దతు ఇస్తొంది బీజేపీ. అయితే సుభాష్ చంద్ర కూడా హరియానాకు చెందిన వారు కావడంతో స్థానికేతరుడి కిందకే వస్తారు. బీజేపీ వ్యూహం ఫలిస్తుందా..? స్వతంత్ర ఎమ్మెల్యేలు, ఇతర పార్టీల ఎమ్మెల్యేలు ఎవరికి మద్దతు ఇస్తారు..? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Read More: Divyavani: టీడీపీ అధికార ప్రతినిధి దివ్యవాణి యూటర్న్..! రాజీనామా ట్వీట్ డిలీట్..! ఏమి జరిగిందంటే..?

Rajya Sabha Polls: సుభాశ్ చంద్రకు రెండో సారి

సుభాశ్ చంద్ర ప్రస్తుతం హరియానా నుండి రాజ్యసభ ఎంపిగా ఉన్నారు. గత ఎన్నికల్లోనూ బీజేపీ ఆయనకు మద్దతు ఇచ్చింది.  సుభాశ్ చంద్ర నామినేషన్ దాఖలు చేయడానికి ముందు మాజీ సీఎం, బీజేపీ నేత వసుంధ రాజే ఆయనను అసెంబ్లీ లారీలో కలిశారు. వసుంత రాజే తో పాటు పలువురు బీజేపీ నేతలు కూడా అక్కడికి చేరుకుని సుభాశ్ చంద్రను కలిశారు. ఇదిలా ఉంటే సీఎం అశోక్ గెహ్లాట్ ఈ అంశంపై మాట్లాడుతూ తమ అభ్యర్ధులు ముగ్గురూ గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ రెండవ అభ్యర్ధి విజయానికి సరిపడా బలం లేదని తెలిసినా పోటీకి నిలిపారు అంటే కొనుగోలు సంస్కృతిని తెచ్చి రాష్ట్రంలో వాతావరణాన్ని చెడగొడతారని అన్నారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Love Guru OTT: ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తున్న విజయ్ ఆంటోనీ ” లవ్ గురు “.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Doordarshan: డీడీ న్యూస్ లోగో రంగు మార్పుపై రేగుతున్న దుమారం

sharma somaraju

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?