NewsOrbit
జాతీయం న్యూస్ బిగ్ స్టోరీ

Central Government : నదులు.. కలవాలి… సిరులు కూరవాలి! అడ్డంకులు ఇవే!!

Central Government : నదులు.. కలవాలి... సిరులు కూరవాలి! అడ్డంకులు ఇవే!!

Central Government : కేంద్ర ప్రభుత్వం Central Government నదుల అనుసంధానానికి ప్రయత్నాలు చేయడం ఎప్పటినుంచో ఉంది.  కేంద్ర ప్రభుత్వం పగ్గాలు ఏ పార్టీ చేపట్టిన దీనిమీద ఎప్పటినుంచో అడుగులు పడుతూనే ఉన్నాయి. మోదీ ప్రభుత్వం మొదటి విడతలో సైతం నదుల అనుసంధానం దాని ముందు ఎలాంటి అవకాశాలు ఉన్నాయి అనే విషయంలో తీవ్రమైన చర్చ సాగింది. భారతదేశం లో భిన్నమైన ప్రాంతాల్లో పుట్టి, అంతే భిన్నంగా సాగిపోయే జీవనదులు అన్నిటినీ కలిపితే దేశమంతా సుభిక్షంగా ఉంటుంది అన్నది అసలు లక్ష్యం. అయితే దీని మీద ఉన్న అడ్డంకులు ఎదురయ్యే సవాళ్లు గురించి కూడా ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తృత చర్చ సాగుతోంది. ముఖ్యంగా జాతీయ జల అభివృద్ధి సంస్థ వెల్లడించిన కొన్ని సలహాలను పరిశీలిస్తే దీనిలో అసలు విషయాలు అర్థమవుతాయి.

rivers merjed for future india Central Government
rivers merjed for future india Central Government

1. సవాల్

** నదులు ప్రవహించే రాష్ట్రాల్లో మిగులు జలాలు ఉన్న రాష్ట్రాలు నదుల అనుసంధానానికి అంగీకరించడం లేదు అన్నది ప్రధానమైన విషయం. నీటిని మళ్ళించే రాష్ట్రం తీసుకునే రాష్ట్రాల మధ్య ఒప్పందం రావడం చాలా కష్టంగా ఉంది. నీరు నదిలో ఎప్పుడూ ఒకే రకంగా పారదు. ఒక్కోసారి హెచ్చుతగ్గులు ఉంటాయి. తగ్గినప్పుడు మిగులు జలాలు ఉన్న రాష్ట్రాలు నష్టపోయే అవకాశం ఉంది అనేది కొన్ని రాష్ట్రాలు వ్యక్తం చేస్తున్న అభ్యంతరం. మరోపక్క మిగులు రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రానికి తరలించే రాష్ట్రం కూడా అధికంగా నీటిని డిమాండ్ చేస్తోంది. దీంతో పక్క పక్క రాష్ట్రాల మధ్య నీటి పంపకాలు ఎంతో కష్టంగా మారుతున్నాయి.

2. సవాల్

** నదుల అనుసంధానానికి రాష్ట్రాలు అంగీకరిస్తే ట్రైబ్యునల్ అవార్డులు అంతర్రాష్ట్ర ఒప్పందం అమలు అవుతాయో లేదో అన్న ఆందోళన అన్ని రాష్ట్రాలకు ఉంది. ఒకవేళ ట్రైబ్యునల్ మాటలు ఆదేశాలు రాష్ట్రాలు పట్టించుకోకపోతే కొత్త సమస్యలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే సాగు విద్యుత్ అవసరాలకు వినియోగించుకుని నీటి పై వ్యతిరేక ప్రభావం ఉంటుందేమో అన్న భయం కొన్ని రాష్ట్రాలకు బలంగా ఉంది. ఒకవేళ అంతర్రాష్ట్ర ఒప్పందాలు తాము విద్యుత్తు ఉత్పత్తికి వాడుకునే నీటిని సైతం ఒప్పందంలో భాగంగా వదులుకోవాల్సి వస్తే కొన్ని రాష్ట్రాలు ఆ విషయంలో వెనకడుగు వేసే అవకాశం ఉంది. నీటి అవసరాలు గణనీయంగా పెరగడంతో తమది మిగులు వేసి ఉన్న రాష్ట్రం అని మొదట అంగీకరించిన రాష్ట్రాలు కూడా ఎప్పుడూ నదుల అనుసంధానం వైపు ఒప్పుకోవడం లేదు. చేతిలో నీటి అవసరాలు మరింత పెరిగితే నదుల అనుసంధానం వల్ల బేసిన్ రాష్ట్రాలు కూడా నష్టపోయే అవకాశం ఉందన్నది వారి భయం.

3. సవాల్

** నీటి లభ్యత తక్కువగా ఉన్న పరివాహక ప్రాంతం నుంచి లభ్యతే లేని పరివాహక ప్రాంతానికి రెండు రాష్ట్రాల మధ్య నీటి ని మళ్లించడం పై ప్రత్యేకంగా అనుమతించడం లేదా నిరోధించడం న్యాయపరమైన ఇప్పటివరకు లేదు. అయితే కొన్ని ప్రత్యేక ఒప్పందాలు ఇరు రాష్ట్రాల మధ్య జరిగే అవగాహన లేదా ఒక పరివాహక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి నీటి మళ్లింపు జరిగింది. వీటినే అంతర్రాష్ట్ర ఒప్పందాలు లేదా ట్రైబ్యునల్ తీర్పును గా చెబుతున్నారు. మరి న్యాయపరంగా ఒక వ్యూహాత్మకమైన చట్టాలు తీర్పులు లేకపోతే భవిష్యత్తులో నీటి గొడవలు వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రాల మధ్య వివాదం తలెత్తితే అది దేశ సమైక్యతకు భంగం వాటిల్లే అవకాశం లేకపోలేదు. ఇది మొత్తం దేశం భద్రతకు సంబంధించిన విషయం గా మారుతుంది.

బచావత్ ట్రైబ్యునల్ ఏం చెప్పింది?

నదుల అనుసంధానం విషయంలో ఎదురయ్యే సవాలు లో ముఖ్యంగా బచావత్ ట్రిబ్యునల్ అవార్డు గురించి చెప్పుకోవాలి. కృష్ణ బేసిన్ నుంచి మరో బేసిన్ కు నీటిని మళ్లించి ఆయకట్టును సంరక్షించాలి లేదా అలా చేస్తే ఏ మేరకు చేయాలి ఎలాంటి చర్యలు తీసుకోవాలి అన్నదానిపై బచావత్ ట్రిబ్యునల్ ముందు చర్చ జరిగింది. దీనికి కర్ణాటక అంగీకరించలేదు. కృష్ణా పరివాహక ప్రాంతం అధికంగా ఉండే కర్ణాటక మిగులు జలాలు ఎక్కువ. దీంతో బచావత్ ట్రిబ్యునల్ ను, సూచనను వినేందుకు సైతం కర్ణాటక ఆసక్తి చూపలేదు. అయితే చివరకు కొన్నిపరిమితులతో కృష్ణ బేసిన్ నుంచి పక్క బేసిన్కు నీటి మళ్లింపు నకు ట్రైబ్యునల్ అంగీకారం తెలిపింది. అలాగే నర్మదా జలాల్లో భాగస్వామ్యం కానీ రాజస్థాన్కు నీటిని కోరే హక్కు లేదని ట్రైబ్యునల్ పేర్కొంది. కానీ రెండు రాష్ట్రాల మధ్య జరిగిన అంతర్రాష్ట్ర ఒప్పందం ద్వారా నీటిని రాజస్థాన్కు కేటాయించారు. ఇలా నీటి పంపిణీ విషయంలో ప్రతి సారి గొడవలు రావడం దానికి ప్రత్యేకమైన చట్టాలు లేకపోవడంతో వివాదాలు అలాగే కొనసాగుతున్నాయి. ఇప్పుడు నదుల అనుసంధానం విషయంలోనూ ముందుకు వెళ్లేందుకు రాష్ట్రాల మధ్య వివాదాలు ఏం జరుగుతాయి అన్న అంశం మీదే కేంద్రం ప్రధానంగా భయపడుతోంది. నీటి పంపిణీ విషయంలో ఏ మాత్రం తేడా వచ్చినా అది మొత్తం దేశ భద్రతకే ప్రమాదం వచ్చే అంశం అవుతుంది కాబట్టి కేంద్రం అడుగులు మెల్లగా పడుతున్నాయి.

 

author avatar
Comrade CHE

Related posts

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju