Fake Currency: ఇది నిజంగా ఆందోళన కల్గించే విషయం..! ఆర్బీఐ కీలక ప్రకటన..!!

Share

Fake Currency: దేశంలో నకిలీ నోట్ల చెలామణి పెద్ద ఎత్తున జరుగుతోంది. నకిలీ నోట్లు, అసలు నోట్ల తేడాను సామాన్యులు గుర్తించడం కష్టతరమే. దేశ వ్యాప్తంగా నగరాల్లో, పట్టణాల్లో కొత్త రూ.500 నకిలీ కరెన్సీ విస్తృతంగా చలామణి అవుతోంది. దేశంలో బ్లాక్ మనీ వెలికి తీయడానికి, నకిలీ నోట్ల కట్టడికి గతంలో కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసింది. ఆ తరువాత నకిలీ నోట్లను ప్రింట్ చేసే అవకాశమే లేదన్నట్లు ఆర్బీఐ పాత నోట్లను పూర్తిగా మార్పు చేసి ఇతర దేశాల కరెన్సీ మాదిరిగా కొత్త నోట్లను ఆర్బీఐ ముద్రించింది.

RS 500 Fake Currency is increasing says RBI
RS 500 Fake Currency is increasing says RBI

ఆర్ బీ ఐ అనేక రకాల జాగ్రత్తలు తీసుకున్నా కేటు గాళ్లు అసలు నోటు పోలిన విధంగానే నకిలీ నోట్లను ముద్రిస్తూనే ఉన్నారు. చలామణి చేస్తూనే ఉన్నారు. ఇటీవల నగర పాలక సంస్థల ఎన్నికల సమయంలో విశాఖకు తరలిస్తున్న రూ.8 కోట్ల నకిలీ నోట్లను పోలీసులు పట్టుకున్న విషయం తెలిసిందే. దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున జరుగుతున్న నకిలీ నోట్ల చలామణిపై రిజర్వ్ బ్యాంక్ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఆర్బీఐ తన తాజా నివేదికలో కీలక విషయాలను వెల్లడించింది.

Read More: Gas Cylinder Blast: గ్యాస్ సిలెండర్ పేలుడుతో రెండు ఇళ్లు నేలమట్టం..! ఏడుగురు మృతి..!!

మన వ్యవస్థలో నకిలీ నోట్ల చలామణి పెరుగుతోందని నివేదికలో పేర్కొంది. ముఖ్యంగా రూ.500 డినామినేషన్ నోట్లు విపరీతంగా చలామణి అవుతున్నట్లు తెలిపింది. రూ.500 నకిలీ కరెన్సీ ఏకంగా 31.4 శాతం మేర పెరిగిందని వెల్లడించింది. ఇతర డినామినేషన్ నోట్ల నకిలీ కరెన్సీ మాత్రం తగ్గిందని తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంలో 39,453 నకిలీ రూ.500 నోట్లను ఆర్ బీ ఐ గుర్తించింది. 30శాతంకు పైగా రూ.500ల నకిలీ నోట్లు చలామణి అవుతుండటం అంటే మాటలు కాదు. ప్రతి ఒక్కరూ లావాదేవీలు జరిగే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

 

 


Share

Related posts

Nimmagadda : వైసీపీ నుంచి నిమ్మగడ్డ కి ఇన్నాళ్ళకి సరైన సమాధానం చెప్పేవాడు వచ్చాడు ?

somaraju sharma

Vakeel saab: బాక్సాఫీస్.. పాలిటిక్స్.. రెండింటినీ షేక్ చేస్తున్న వకీల్ సాబ్..!!

Yandamuri

పాత నోట్లు, పాత నాణేలు ఉన్నవారికి బంపర్ ఆఫర్..?

Teja