Delhi Mayor Poll: ఢిల్లీ మేయర్ ఎన్నిక వివాదంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కు సుప్రీం కోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. ఢిల్లీ మేయర్ ఎన్నికల ఇప్పటికే పలు మార్లు వాయిదా పడటంతో ఈ ఎన్నికలు త్వరగా జరిగేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఆప్ మేయర్ అభ్యర్ధి షెల్లీ ఒబరాయ్ దాఖలు చేసిన పిటిషన్ పై శుక్రవారం సుప్రీం కోర్టు విచారణ జరిపింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహా, జస్టిస్ జేబీ పార్ధీవాలా నేతృత్వంలోని ధర్మాసనం కీలక ఉత్తర్వులు ఇచ్చింది. ఢిల్లీ మేయర్ ఎన్నికల్లో నామినేటెడ్ సభ్యులకు ఓటు హక్కు లేదని సుప్రీం కోర్టు మరో సారి తేల్చి చెప్పింది. అలాగే మేయర్ ఎన్నికను ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ తొలి సమావేశంలోనే నిర్వహించాలని సూచించింది. ఒక సారి మేయర్ ఎన్నిక జరిగాక వారే డిప్యూటి మేయర్ ఎన్నికకు అధ్యక్షత వహిస్తారని తెలిపింది. మేయర్ ఎన్నిక కోసం మొదటి సమావేశం ఏర్పాటు చేసేందుకు 24 గంటల్లో నోటీసు జారీ చేయాలని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.

మేయర్ ఎన్నికకు సంబంధించి బీజేపీ, ఆప్ ల మధయ్ పెద్ద యుద్దమే నడుస్తొంది. నామినేటెడ్ మెంబర్ల సాయంతో మేయర్ పదవి కైవశం చేసుకోవాలని బీజేపీ యత్నిస్తొందని ఆప్ ఆరోపిస్తొంది. డిసెంబర్ లో జరిగిన ఎన్నికల్లో మొత్తం 250 వార్డులకు గానూ ఆప్ 133 స్థానాలు కైవశం చేసుకోగా, బీజేపీ 105 వార్డులు గెలుచుకుంది. కాంగ్రెస్ పార్టీ 8 వార్డులకే పరిమితం అయ్యింది. అత్యధిక స్థానాలు కైవశం చేసుకున్న ఆప్ కే మేయర్ పదవి దక్కే అవకాశాలు ఉంటాయి. అయితే లెప్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా నియమించిన పది మంది నామినేటెడ్ కౌన్సిలర్లతో ప్రిసైడింగ్ అధికారి ప్రమాణ స్వీకారం చేయించడం వివాదానికి దారి తీసింది. దీంతో మేయర్ ఎన్నికలో నామినేటెడ్ సభ్యులు ఓటు వేయడానికి అనుమతి లేదంటూ ఆప్ వ్యతిరేకిస్తున్నది.
బీజేపీ, ఆప్ కౌన్సిలర్ల గలభా కారణంగా మేయర్ ఎన్నిక మూడు సార్లు వాయిదా పడింది. రెండు నెలలకు పైగా మేయర్ ఎన్నిక పంచాయతీ నడుస్తొంది. ఈ తరుణంలో ఆప్ మేయర్ అభ్యర్ధి సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో ఇటీవల విచారణ జరిపిన న్యాయస్థానం .. నామినేటెడ్ సభ్యులకు ఓటు హక్కు ఉండదని వ్యాఖ్యానించింది. అయితే సమయాభావం వల్ల విచారణను ఈ నెల 17వ తేదీ (నేటికి) వాయిదా వేసిన సర్వోన్నత న్యాయస్థానం ..తాజాగా ఇచ్చిన ఆదేశాలతో ఆప్ కు బిగ్ రిలీఫ్ ఇచ్చినట్లు అయ్యింది.
చంద్రబాబు, లోకేష్ పై మరో సారి ఘాటుగా కామెంట్స్ చేసిన కొడాలి నాని