Centre vs Delhi govt case: దేశ రాజధాని ఢిల్లీలో పాలనా వ్యవహారాలపై నియంత్రణ అధికారం ఎవరికి ఉండాలనే వివాదంపై సుప్రీం కోర్టులో కేంద్రానికి ఎదురుదెబ్బ తగిలింది. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ సర్కార్ కు బిగ్ రిలీఫ్ లభించింది. ప్రజల ద్వారా ఎన్నికైన ప్రభుత్వానికే ఢిల్లీ పాలనా వ్యవహారాలపై అసలైన అధికారాలు ఉండాలని సూప్రీం కోర్టు గురువారం కీలక తీర్పు ఇచ్చింది.

ఢిల్లీ ప్రభుత్వానికి అధికారాలు లేవు అన్న గత తీర్పును సర్వోన్నత న్యాయస్థానం తోసి పుచ్చింది. ప్రభుత్వ అధికారులపై స్థానిక ప్రభుత్వానికే అధికారాలు ఉంటాయని అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పును ఇచ్చింది. ఇదే సమయంలో ఢిల్లీలో ఎన్నికైన ప్రభుత్వ నిర్ణయాలను లెఫ్ట్ నెంట్ గవర్నర్ (ఎల్ జీ) కట్టుబడి ఉండాలని కూడా స్పష్టం చేసింది. ప్రజల అభీష్టం ప్రతిబంబించేలా చట్టాలు చేసే అధికారాలు ఢిల్లీ అసెంబ్లీకి ఉన్నాయని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. శాంతి భద్రతలు మినహా మిగతా అన్ని అంశాలపై ఢిల్లీ ప్రభుత్వానికే నియంత్రణ ఉండాలని సీజే జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం తేల్చి చెప్పింది.
Shiv Sena: సుప్రీం కోర్టులో షిండేకి షాక్..?