NewsOrbit
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

Shiv Sena: సుప్రీం కోర్టులో షిండేకి షాక్..?

Shiv Sena: సుప్రీం కోర్టులో షిండే వర్గానికి ఎదురుదెబ్బ తగిలింది. మహారాష్ట్ర శివసేన సంక్షోభ వివాదం విస్తృత ధర్మాసనానికి సుప్రీం కోర్టు బదిలీ చేసింది. ఆ రాష్ట్ర స్పీకర్ నిర్ణయాలను సుప్రీం తప్పుబట్టింది. షిండే వర్గానికి చెందిన గోగావాలే ను శివసేన చీఫ్ విప్ గా స్పీకర్ నియమించడం చట్టవిరుద్దమని తెలిపింది.  పార్టీ నిర్ణయించిన విప్ ను మాత్రమే గుర్తించాలని చెప్పింది. అధికారిక విప్ ను గుర్తించడంలో స్పీకర్ విఫలమయ్యారని వెల్లడించింది. రెండు వర్గాల విభేదాల పై స్పీకర్ అప్రమత్తంగా ఉండాలని సూచించింది. శివసేన ఉద్దవ్ వర్గం, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే దాఖలు చేసిన పిటిషనర్ల పై గురువారం సుప్రీం కోర్టు విచారణ జరిపింది. పార్టీల వివాదం పరిష్కారానికి విశ్వాస పరీక్ష ఒక్కటే మార్గం కాదని సుప్రీం కోర్టు తెలిపింది. ఎమ్మెల్యేల మద్దతు ఉపసంహరణపై ఎలాంటి ఆధారాలు లేవని చెప్పింది.

Uddhav Thackeray Eknath Shinde

 

ఎమ్మెల్యేల అన్హతపై స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని వెల్లడించింది. బలపరీక్ష ఎదుర్కోకుండానే రాజీనామా చేసినందున ఉద్దవ్ ఠాక్రే ను సీఎంగా పునరుద్దరించలేమని స్పష్టం చేస్తూ..ఉద్దవ్ ఠాక్రే ప్రభుత్వం మద్దతును ఏ విధంగా నిర్ణయించారన్న దానిపై పూర్తి స్థాయి విచారణ కోసం ఏడుగురు సభ్యుల ధర్మాసనం విచారణ చేస్తుందని తెలిపింది. ఉద్దవ్ ఠాక్రే ప్రభుత్వాన్ని తిరిగి పునరుద్దరించలేమని చెప్పడం ద్వారా షిండే వర్గానికి కొంతలో కొంత ఊరట లభించింది. అలాగే గవర్నర్ తీసుకున్న నిర్ణయం సక్రమంగా లేదని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. దీంతో మహారాష్ట్ర సంక్షోభానికి ఇంకా తెరపడలేదు. ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం వెలవరించే తీర్పు ఫైనల్ కానున్నది.

దాదాపు తొమ్మిది రోజుల పాటు సాగిన ఈ కేసు విచారణలో ఉద్దవ్ ఠాక్రే వర్గం తరపున కపిల్ సిబాల్, అషిషేక్ మను సింఘ్వీ, మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే వర్గం తరపున హరీశ్ సాల్వే, ఎన్ కే కౌల్, మహేశ్ జెఠ్మలానీ వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న అత్యున్నత ధర్మాసనం మార్చి 16న తీర్పును రిజర్వ్ చేసింది. ఇవేళ ఏడుగురు సభ్యుల విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది సుప్రీం కోర్టు.

2022 జూన్ లో శివసేన కు చెందిన మొత్తం 55 మంది ఎమ్మెల్యేల్లో 40 మంది తిరుగుబాటు నేత ఎక్ నాథ్ షిండే కు మద్దతు ఇవ్వడంతో ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలోని మహావికాస్ అఘాడీ ప్రభుత్వం కూలిపోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత బీజేపీ ఎమ్మెల్యేల మద్దతుతో సీఎంగా షిండే బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఫిబ్రవరి 20న తిరుగుబాటు ఎమ్మెల్యేలు, వారికి నేతృత్వం వహించిన ఏక్ నాథ్ షిండే అనర్హత అంశాన్ని సత్వరమే తేల్చాలంటూ ఉద్దవ్ వర్గం సుప్రీం కోర్టును ఆశ్రయించింది.

Mudragada Padmanabham: కీలక నిర్ణయాన్ని వెల్లడించిన ముద్రగడ .. వైసీపీ వైపు అడుగులే(నా)..?

author avatar
sharma somaraju Content Editor

Related posts

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!