NewsOrbit
జాతీయం న్యూస్

బీబీసీ కి సుప్రీం కోర్టులో బిగ్ రిలీఫ్ .. ఆ పిటిషన్ ను కొట్టేవేసిన సర్వోన్నత న్యాయస్థానం

గుజరాత్ లో 2022 లో జరిగిన అల్లర్లపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ పై కొద్ది రోజులుగా వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీబీసీ కార్యకలాపాలను భారత్ లో పూర్తిగా నిషేదించాలని కోరుతూ  హిందూ సేన చీఫ్ విష్ణు గుప్తా, బీరేంద్ర కుమార్ సింగ్ లు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ల తరపు న్యాయవాది పింకీ ఆనంద్ వాదనలు వినిపిస్తూ..  భారత్ కు, భారత ప్రభుత్వానికి బీబీసీ వ్యతిరేకంగా పని చేస్తొందని ఆరోపించారు. ఈ క్రమంలోనే భారత ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు ఉద్దేశపూర్వకంగా తాజా లఘు చిత్రాన్ని (డాక్యుమెంటరీ) రూపొందించిందనీ, దీని వెనుక కుట్ర ను బహిర్గతం చేసేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)తో దర్యాప్తు జరిపించాలని కోరారు. పిటిషనర్ అభ్యర్ధనను విన్న జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎంఎం సుందరేశ్ లతో కూడిన ధర్మాసనం .. ఓ డాక్యుమెంటరీ దేశాన్ని ఎలా ప్రభావితం చేయగలదని ప్రశ్నించారు. దీనిని తప్పుగా భావించారనీ, ఇది విచారణకు అనర్హమని పేర్కొంది. నిషేదంపై అదేసాలు న్యాయస్థానం ఎలా జారీ చేస్తుందని పిటిషనర్ ను ప్రశ్నించింది. ఈ పిటిషన్ విచారణకు తిరస్కరించింది ధర్మాసనం.

Supreme Court

 

మరో పక్క ఇండియా: ది మోడీ క్వశ్చన్ పేరిట రూపొందించిన డాక్యుమెంటరీ పై ఆంక్షలను సవాల్ చేస్తూ సీనియర్ పాత్రికేయుడు ఎన్ రామ్, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మహువా మొయిత్రా, సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కలిసి వేసిన పిటిషన్ తో పాటు మరో న్యాయవాది ఎంఎల్ శర్మ ధాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీం కోర్టు ఇటీవలే విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా డాక్యుమెంటరీని నిషేదిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులకు సంబంధించిన పూర్తి రికార్డులను మూడు వారాల్లో సమర్పించాలని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సుందరేశన్ లతో కూడిన దర్మాసనం ఫిబ్రవరి 3న కేంద్రానిన ఆదేశించింది. తదుపరి విచారణను ఏప్రిల్ కు వాయిదా వేసింది.

ఏపి రాజధాని అంశంపై సుప్రీం కోర్టు కు కేంద్రం అఫిడవిట్.. ట్విస్ట్ ఏమిటంటే..?

author avatar
sharma somaraju Content Editor

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju