21.7 C
Hyderabad
December 2, 2022
NewOrbit
జాతీయం న్యూస్

ఎన్నికల కమిషనర్ల నియామకంపై సుప్రీం కోర్టులో ముగిసిన విచారణ .. తీర్పు రిజర్వ్

Share

ఎన్నికల కమిషన్ లో సంస్కరణలు, స్వయంప్రతిపత్తి అంశాలపై సుప్రీం కోర్టులు విచారణ ముగిసింది. వరుసగా మూడవ రోజు విచారణలోనూ కేంద్రం తీరును రాజ్యాంగ ధర్మాసనం తీవ్రంగా తప్పుబట్టింది. సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఆదేశాల మేరకు అటార్నీ జనరల్ ఇవేళ ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ నియామకానికి సంబంధించిన దస్త్రాలను కోర్టుకు అందజేశారు. తాజా ఎన్నికల కమిషనర్ నియామకంపై ఎందుకు అంత తొందర పడ్డారని ధర్మాసనం ప్రశ్నించింది. కేంద్రం తరపు వాదనలు వినిపిస్తున్న అటార్నీ జనరల్ ను ఉద్దేశించి తమ అభ్యంతరం అంతా ఎంపిక ప్రక్రియపైనేనని ధర్మాసనం పేర్కొంది.

supreme Court

తెలుగు రాష్ట్రాల్లో అయదుగురు హైకోర్టు న్యాయమూర్తులు బదిలీ

మే 15వ తేదీ నుండి ఎన్నికల కమిషనర్ స్థానం ఖాళీగానే ఉందని, అప్పటి నుండి నవంబర్ 18వ తేదీ వరకూ కేంద్ర ప్రభుత్వం అసలు ఏమి చేసిందని ధర్మాసనం ప్రశ్నించింది. ఓ పక్క సుప్రీం కోర్టులో పిటిషన్ల పై విచారణ జరుగుతుండగా, నవంబర్ 18న అంత హడావుడిగా నిర్ణయం ఎందుకు తీసుకున్నారు. నవంబర్ 18వ తేదీనే ఫైల్ మువ్ చేసి.. అదే రోజు ప్రధాని ఎందుకు ఆమోదించారు అని కేంద్రాన్ని రాజ్యాంగ ధర్మాసనం సూటిగా నిలదీసింది.

ఎన్నికల సంఘంలో నియామకాల కోసం కొలీజియం లాంటి వ్యవస్థ అవసరం అంటూ ధాఖలైన పిటిషన్ పై జస్టిస్ కేఎం జోసెఫ్ నేతృత్వంలోన అయిదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం వరుసగా మూడు రోజులు విచారణ చేపట్టింది. గురువారం నాటికి వాదనలు పూర్తి కావడంతో సీఈసీ, ఈసీ నియామకాలపై స్వతంత్ర ప్యానెల్ ఏర్పాటు చేయాలా లేదా అనే దానిపై తీర్పును రిజర్వ్ చేసింది రాజ్యాంగ ధర్మాసనం.

YSRCP: కొడాలి, అనిల్ యాదవ్ లకు! బాలినేనికి షాక్ ఇచ్చిన జగన్..! 8 మంది మార్పు వెనుక కారణం..!?


Share

Related posts

Colgate: కోల్గేట్ పేస్ట్‌ అక్కడ బ్యాన్ కానుందా? కోల్గేట్‌ కోసం బారులుతీరుతున్న జనం!

Ram

బిగ్ బాస్ రెమ్యూనరేషన్ అంత ఏం ఇవ్వలేదు: కుమార్ సాయి!

Teja

Curd: పెరుగు వీళ్లు అస్సలు తినకూడదట..!! ఎందుకంటే..

bharani jella