దేశంలో తీవ్ర దుమారానికి దారి తీసిన ఆదానీ గ్రుప్ వ్యవహారంపై నేడు సుప్రీం కోర్టులో విచారణ జరగనున్నది. ఆదానీ గ్రూప్ పై హిండెన్ బర్గ్ ఇచ్చిన నివేదికపై దాఖలైన పిల్ ను విచారించేందుకు సుప్రీం కోర్టు అంగీకరించిన విషయం తెలిసిందే. ఆదానీ గ్రూప్ పై వచ్చిన ఆరోపణలపై విశ్రాంత సుప్రీం కోర్టు న్యాయమూర్తి పర్యవేక్షణలో కమిటీ ఏర్పాటు చేసేసా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ న్యాయవాది విశాల్ తివారీ పిటిషన్ దాఖలు చేశారు. తన పిటిషన్ పై అత్యవసర విచారణ చేపట్టాలని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ ధర్మాసనం ముందు విశాల్ తివారీ అభ్యర్ధించారు.

ఇదే అంశంపై శుక్రవారం రానున్న మరిన్ని పిటిషన్లను కలిపి విచారణ జరపాలని కోరారు. ఇదే క్రమంలో పెద్ద కార్పోరేట్లకు ఇచ్చిన రూ.500 కోట్లకు పైగా రుణాలను పర్యవేక్షించడానికి ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని విన్నవించారు విశాల్ తివారీ. ఆదానీ గ్రూప్ పై సంచలన నివేదిక ఇచ్చి ఆ సంస్థ మార్కెట్ విలువ పతనానికి కారణమైన హిండెన్ బర్గ్ రీసెర్చ్ సంస్థ యజమాని నాథన్ అండర్సన్, అతని అనుచరులపై దర్యాప్తునకు ఆదేశించాలని సీనియర్ న్యాయవాది ఎంఎల్ శర్మ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపైనా నేడు సుప్రీం కోర్టు విచారణ చేపట్టనున్నది.
ఆదానీ గ్రుప్ తన షేర్లలో అవకతవకలకు పాల్పడుతోందనీ, ఖాతాల్లో కూడా మోసాలు చేస్తొందని అమెరికాకు చెందిన హిండెన్ బర్గ్ రీసెర్చ్ సంస్థ గత వారం ఇచ్చిన నివేదక తీవ్ర దుమారానికి దారి తీసింది. అయితే ఈ ఆరోపణలను అదానీ గ్రుప్ తీవ్రంగా ఖండించింది. కాగా ఈ నివేదిక నేపథ్యంలో ఇటీవల ఆదానీ సంస్థకు చెందిన కంపెనీల షేర్లు భారీగా పతనమైయ్యాయి. పార్లమెంట్ ఉభయ సభల్లోనూ విపక్షాలు ఈ అంశంపై చర్చించాలంటూ ఆందోళన చేశాయి.
YCP MLA: వైసీపీ మహిళా ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు..! అంబేద్కరిస్టులు గుస్సా..!!