NewsOrbit
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

ప్రముఖ నటి, మాజీ ఎంపీ జయప్రదకు బిగ్ షాక్ .. ఆరు నెలల జైలు శిక్ష వేసిన చైన్నైఎగ్మోర్ కోర్టు

Advertisements
Share

ప్రముఖ నటి, మాజీ ఎంపీ జయప్రదకు చెన్నై ఎగ్మోర్ కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. లేబర్ గవర్నమెంట్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన అనంతరం ఎగ్మోర్ కోర్టు ఈ తీర్పు ఇచ్చింది. జయప్రదతో పాటు మరో ఇద్దరికి కోర్టు జైలు శిక్ష, రూ.5వేల జరిమానా విధించింది. చెన్నైలోని రాయపేటలో జయప్రదకు ఓ సినిమా ధియేటర్ ఉంది. చెన్నైకి చెందిన రామ్ కుమార్, రాజబాబు తో కలిసి అన్నా రోడ్డులో సినిమా ధియేటర్ ను నడిపించారు.

Advertisements

సినిమా థియేటర్ లో పని చేస్తున్న కార్మికుల నుండి వసూలు చేసిన ఈఎస్ఐ మొత్తాన్ని చెల్లించకపోవడంతో కార్మికులు ఎగ్మోర్ కోర్టును ఆశ్రయించారు. వాళ్లకు రావాల్సిన మొత్తాన్ని ఇస్తాననీ, ఈ పిటిషన్ ను కొట్టివేయాలని జయప్రద కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా అందుకు కోర్టు ఒప్పుకోలేదు. కార్మికులకు అందాల్సిన మొత్తాన్ని చెల్లిస్తానని జయప్రద కోర్టుకు తెలుపగా, అందుకు లేబర్ గవర్నమెంట్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ న్యాయవాది అభ్యంతరం తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు .. జయప్రద సహా ముగ్గురికి ఆరు నెలల జైలు శిక్ష, ఆయిదు వేల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చింది.

Advertisements

2024 ఎన్నికలపై వైసీపీ ఎంపీ విజయసాయి ఆసక్తికర వ్యాఖ్యలు


Share
Advertisements

Related posts

నవరత్న ఆయిల్ రాశారా శకుని మామా?

Mahesh

Today Gold Rate: బంగారం ధర జిగేల్.. వెండి పతనం.. నేటి ధరలు ఇలా..!!

bharani jella

సన్నగా మారుస్తానని చెప్పి కూతురు వయసున్న ఫ్రెండ్ భార్యతో ఏం చేసాడో తెలుసా?

sowmya