Road Accident: ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వివాహా వేడుకకు హజరై తిరిగి వెళుతున్న బృందం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఏడుగురు దుర్మరణం పాలైయ్యారు. బొలెరో వాహనం అదుపుతప్పి కాల్వలోకి దూసుకుపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బొలెరో వాహనంలో 11 మంది ఉండగా, ఏడుగురు మృతి చెందగా మిగిలిన వారు తీవ్ర గాయాలతో బయపడ్డారు.

వివరాల్లోకి వెళితే.. ఝార్సుగూడ జిల్లా లఖిన్ పుర్ పరిధిలోని బదాధర గ్రామానికి చెందిన 11 మంది సంబల్ పూర్ లోని పరమన్ పుర్ లో జరిగిన ఓ వివాహ వేడుకకు బొలెరో వాహనంలో వెళ్లారు. అనంతరం అర్థరాత్రి దాటిన తర్వాత వీరు తిరుగు ప్రయాణం అయ్యారు. సంబల్ పుర్ జిల్లా ససన్ కాలువ కాలువ వద్దకు రాగానే బొలెరో అదుపుతప్పి కెనాల్ లో పడిపోయింది. ఆ సమయంలో నలుగురు బయటపడగా, మిగిలిన ఏడుగురు మృత్యువాతపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మృతులను అజిత్ ఖమారి, దివ్య లోహా, సుబల్ భోయ్, సుమంత్ భోయ్, సరోజ్ సేథ్, రమాకాంత్ భోయ్, డ్రైవర్ శతృఘ్న భోయ్ గా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతుల కుటుంబాలకు సమాచారం అందించారు.
Breaking: ఢిల్లీలో మరో భారీ అగ్ని ప్రమాదం