25.2 C
Hyderabad
January 31, 2023
NewsOrbit
జాతీయం న్యూస్

శ్రద్దా హత్య కేసు .. అప్తాబ్ ను తరలిస్తున్న పోలీస్ వాహనంపై కత్తులతో దాడి

Share

ఢిల్లీలో శ్రద్దా వాకర్ హత్య కేసులో నిందితుడు అప్తాబ్ అమీన్ పూనావాలాను తీసుకువెళుతున్న పోలీస్ వాహనంపై కొందరు యువకులు కత్తులతో దాడికి ప్రయత్నించారు. ఊహించని ఈ పరిణామానికి ఖంగుతిన్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు గాలిలోకి గాల్పులు జరిపారు. ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలోని ఎఫ్ఎస్ఐ ల్యాబ్ లో సోమవారం సాయంత్రం అప్తాబ్ కు పాలిగ్రఫీ పరీక్షలు నిర్వహించేందుకు తీసుకువెళ్లారు. అయితే ఆనారోగ్య కారణాలతో పరీక్షలు జరగలేదని తెలిసింది. ఆ తర్వాత ఆయనను పోలీస్ వాహనంలో తీహార్ జైలుకు పోలీసు వాహనంలో తీసుకువెళుతున్న క్రమంలో హిందూ సేన కార్యకర్తలుగా చెప్పుకుంటున్న కొందరు యువకులు పోలీసు వాహనాన్ని అడ్డగించారు.

Aftab Attack

కత్తులతో దూసుకువచ్చిన ఆ యువకులు పోలీస్ వాహనంపై దాడికి ప్రయత్నించారు. వాడు మా సోదరి శ్రద్దను చంపి 35 ముక్కులుగా చేశాడు, మేమువాడిని చంపి 70 ముక్కలు చేస్తాం, వాటికి పోలీస్ సెక్యురిటీ కల్పించడం ఏమిటి, మాకు వాడిని అప్పగించండి, చంపేస్తాం అంటూ వాళ్లు నినాదాలు చేశారు. తల్వార్ లతో యువకులు వాహనంపైకి రావడంతో పోలీసులు ఒక్క సారిగా షాక్ అయ్యారు. వెంటనే పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపి కత్తులతో ఉన్న ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు.

శ్రద్ద ను దారుణంగా హత్య చేసిన అఫ్తాబ్ .. ఆమె శరీర భాగాలను 35 ముక్కులుగా చేసి ముందుగా రిఫ్రిజిరేటర్ లో భద్రపరి తర్వాత ఢిల్లీ గురుగ్రామ్ లోని అటవీ ప్రాంతంలో పడవేశాడని ఆరోపణలు ఉన్నాయి. పోలీసు విచారణలో ఆమెను నరికి చంపినట్లు అంగీకరించిన అఫ్తాబ్ దర్యాప్తునుతప్పుదోవ పట్టించే సమాధానాలు చెబుతున్నాడనీ ఢిల్లీ పోలీసులు కోర్టుకు తెలిపారు. కాగా శ్రద్ద బంగారపు ఉంగరాన్ని అప్తాబ్ మరో గర్ల్ ప్రెండ్ కు బహుమతిగా ఇచ్చినట్లు పోలీసు దర్యాప్తులో తేలింది. శ్రద్ద ను హత్య చేసిన తర్వాత ఆమె ఉంగరాన్ని తన వద్దే ఉంచుకున్న అప్తాబ్ .. మరో యువతికి వలవేసి ఇంటికి పిలిపించుకున్నాడని, ఆ సమయంలో ఆమెకు ఈ బంగారపు ఉంగరాన్ని గిఫ్ట్ ఇచ్చాడని సమాచారం. రీసెంట్ గా పోలీసులు ఆమెను విచారించగా, ఉంగరాన్ని అప్తాబ్ బహుమతిగా ఇచ్చినట్లు తెలియజేసింది. ఆ ఉంగరాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు దాన్ని శ్రద్దా తండ్రికి చూపగా, అది తన కుమార్తెదేనని గుర్తించారు.

 


Share

Related posts

Prabhas: ప్రభాస్ తనకి ఎంత మర్యాద ఇచ్చాడో చెప్పిన జబర్దస్త్ కమెడియన్ అప్పారావు..!!

sekhar

బండి సంజయ్ ఈ ప్రయోగం సక్సెస్ అయితే భాగ్యనగరం లో కూడా కాషాయ జెండా ఎగరటం గ్యారెంటి..??

sekhar

YCP Plenary 2022: వైసీపీ ప్లీనరీ .. జగన్ టార్గెట్స్ ..! టీడీపీని వణికించేలా భారీ ప్లాన్స్

Special Bureau