NewsOrbit
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

కర్ణాటకలో కొలువుతీరిన కాంగ్రెస్ ప్రభుత్వం .. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సిద్ద రామయ్య, డిప్యూటిగా డీకేఎస్

Siddaramaiah sworn in as chief minister of Karnataka and dk Sivakumar as deputy chief minister

కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుతీరింది. ముఖ్యమంత్రిగా సిద్దరామయ్య, డిప్యూటి సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. వీరితో పాటు 8 మంది మంత్రులు ప్రమాణం చేశారు. గవర్నర్ ధవర్ చంద్ గెహ్లాట్ ప్రమాణ స్వీకారం చేయించారు. బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో జరిగిన ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో లక్షలాది మంది పార్టీ శ్రేణులు, అభిమానులు హజరైయ్యారు. వారి సమక్షంలో వారి అభిమాన నేతలు ప్రమాణ స్వీకారం చేశారు.

Siddaramaiah sworn in as chief minister of Karnataka and dk Sivakumar as deputy chief minister
Siddaramaiah sworn in as chief minister of Karnataka and dk Sivakumar as deputy chief minister

 

ఏఐసీసీ అధినేత మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తో పాటు తమిళనాడు సీఎం స్టాలిన్, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, బీహార్ సీఎం నితీష్ కుమార్, ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరైన్, ఎన్సీపీ నేత శరద్ పవార్, జమ్ముకశ్మీర్ మాజీ సీఎం ఫరూఖ్ అబ్దుల్లా, బీహార్ డిప్యూటి సీఎం తేజస్వి యాదవ్, శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్దవ్ ఠాక్రే, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, టీఎంసీ తరుపున ఆ పార్టీ ఎంపీ కాకాలి ఘోష్ దస్తిదార్ తదితర ప్రముఖులు కూడా ఈ ప్రమాణ స్వీకారానికి హజరైయ్యారు.

Siddaramaiah sworn in as chief minister of Karnataka and dk Sivakumar as deputy chief minister

 

ప్రమాణ స్వీకారం అనంతరం రాహుల్ గాంధీ మాట్లాడుతూ కర్ణాటకలో స్వచ్చమైన, అవినీతి రహిత పాలన అందిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. కర్ణాటకలో కాంగ్రెస్ విజయం సాధించిన తర్వాత పార్టీ విక్టరీపై అనేక కథనాలు, విశ్లేషణలు వచ్చాయి కానీ కాంగ్రెస్ పేదలు, దళితులు, ఆదివాసీలు, వెనుకబడిన వర్గాల వైపు నిలబడినందుకే గెలిచిందని తాను విశ్వసిస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి పేదలు అండగా ఉన్నారన్నారు. కాంగ్రెస్ పక్షాన నిజం ఉంది, బీజేపీ కి డబ్బు ఉంది. పోలీసులు అండగా ఉన్నారని అయినా ప్రజలు బీజేపీని ఓడించారన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అయిదు వాగ్దానాలను చేసిందనీ, అవి కర్ణాటక ప్రభుత్వ మొదటి క్యాబినెట్ సమావేశంలోనే చట్టంగా మారుతాయని రాహుల్ గాంధీ ప్రకటించారు.

NTR Satha Jayanthi: ఎన్టీఆర్ శత జయంతి వేడుకలకు జూనియర్ ఎన్టీఆర్ డుమ్మా .. రీజన్ ఇదే..!

Rahu Gandhi

 

author avatar
sharma somaraju Content Editor

Related posts

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju