Siva Rama KrishnaRao: సన్యాసం స్వీకరించిన మాజీ ఎమ్మెల్యే..!!

Share

Siva Rama KrishnaRao : ఐదు దశాబ్దాల పాటు రాజకీయాల్లో కొనసాగిన సీనియర్ నాయకుడు సన్యాసం స్వీకరించారు.. ఈ అంశం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది..  బద్వేలు నియోజకవర్గానికి చెందిన డాక్టర్ శివరామకృష్ణ రావు రాజమండ్రి పుష్కర ఘాట్ వద్ద శాస్త్రోక్తంగా గురువుల ఆశీస్సులతో సన్యాసం స్వీకరించారు.. ఇప్పటినుంచి ఆయన స్వామి శివరామానంద సరస్వతి గా కొనసాగనున్నారు..

Siva Rama KrishnaRao : Ex MLA Shocking decision
Siva Rama KrishnaRao : Ex MLA Shocking decision

శివరామకృష్ణ రావు బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి సన్నిహితుడుగా ఆయన క్రియాశీల రాజకీయాల్లో కొనసాగారు.. మొదటిసారి 1972లో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 1977లో బద్వేలు నుంచి జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తరువాత 1983, 1985 ఎన్నికల్లో ఓటమి పాలైన.. 1989 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 1994, 1999, 2001 ఎన్నికల్లో పోటీ చేసి ఆయన ఓటమి చవి చూశారు..

Siva Rama KrishnaRao : Ex MLA Shocking decision
Siva Rama KrishnaRao : Ex MLA Shocking decision

అయితే రాష్ట్ర విభజన తర్వాత ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. 2019 ఎన్నికలకు ముందు వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నప్పటికీ.. 2015 నుంచి ఆధ్యాత్మిక చింతన వైపు మొగ్గు చూపి మానస సరోవర్ , ఛార్ ధామ్, అమర్నాథ్ లతో పాటు పలు శక్తి పీఠాలను శివరామకృష్ణ సందర్శించారు. రిషికేష్ కు చెందిన గురువు శ్రీ సద్గురు తత్వవిదానంద సరస్వతి శిష్యరికంలో కొనసాగుతున్నారు..


Share

Related posts

బిగ్ బాస్ 4: ఫస్ట్ టైం హౌస్ లో కంటతడి పెట్టిన అభిజిత్..!!

sekhar

Anupama Parameswaran Gorgeous Photos

Gallery Desk

బెంగళూరు జగన్ ఫాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు..!!

sekhar