జాతీయం న్యూస్

Lakhimpur Kheri Case: లఖిపుర్ హింస కేసు.. కేంద్ర మంత్రి కుమారుడు అశిష్ మిశ్రకు సుప్రీం కోర్టు బిగ్ షాక్

Share

Lakhimpur Kheri Case: కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు అశిష్ మిశ్రాకు సుప్రీం కోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. లఖింపుర్ ఖేరీ హింస కేసులో అలహాబాద్ హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ ను సుప్రీం కోర్టు రద్దు చేసింది. ఈ మేరకు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు ఇచ్చింది. నిందితుడు వారం లోపు లొంగిపోవాలని ఆదేశించింది. అలహాబాద్ హైకోర్టు.. అశిష్ మిశ్రాకు మంజూరు చేసిన బెయిల్ ను సుప్రీం కోర్టు రద్దు చేసింది. హైకోర్టు బాధితుల పక్షాన ఉన్న అంశాలను పరిగణలోకి తీసుకోలేదనీ, హైకోర్టు తన అధికార పరిధిని అతిక్రమించిందని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. మిశ్రా బెయిల్ విషయంపై సుప్రీం కోర్టులో ఈ నెల 4వ తేదీన కూడా విచారణ జరిపింది.

Supreme Court Cancels bail on Lakhimpur Kheri Case
Supreme Court Cancels bail on Lakhimpur Kheri Case

Lakhimpur Kheri Case: బెయిల్ మంజూరులో హైకోర్టు చెప్పిన కారణాలపై సుప్రీం కోర్టు తీవ్ర అభ్యంతరం

సుప్రీం కోర్టు నేతృత్వంలో నియమించిన ప్రత్యేక దర్యాప్తు కమిటీ (సిట్) సూచనలను యూపీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం పైనా సుప్రీం కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. బెయిల్ మంజూరు సమయంలో హైకోర్టు చెప్పిన కారణాలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. బెయిల్ పై విచారణ సందర్భంలో అలహాబాద్ హైకోర్టు పలు అంశాలను ప్రస్తావించడాన్ని సుప్రీం కోర్టు తప్పుబట్టింది. బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్ పై తీర్పును రిజర్వులో ఉంచుతున్నట్లు ప్రకటించిన సుప్రీం ధర్మాసనం నేడు తీర్పును వెల్లడించింది. ఈ కేసులో రైతుల తరపున సీనియర్ న్యాయవాదులు దుష్యంత్ దవే, ప్రశాంత్ భూషణ్ లు వాదనలు వినిపించారు.

.

అక్టోబర్ 3న హింసాత్మక ఘటన

లఖింపుర్ టికూనియా ప్రాంతంలో గత ఏడాది అక్టోబర్ 3న హింసాత్మక ఘటన జరిగింది. నిరసన తెలియజేస్తున్న రైతులపై నుండి కేంద్ర మంత్రి అజయ్ మిశ్ర కుమారుడి కారు దూసుకువెళ్లింది. దీంతో నలుగురు రైతులు సహా ఎనిమిది మంది మృతి చెందారు. ఈ ఘటనపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తం అయ్యాయి. ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో పోలీసులు అశిష్ మిశ్ర ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.


Share

Related posts

YS Jagan: జగ‌న్‌కు షాక్‌… కేసీఆర్ కు ఝ‌ల‌క్ ఎలా అంటే…

sridhar

Lock Down: దేశంలో లాక్ డౌన్ … అస‌లేం జ‌రుగుతుందంటే..

sridhar

Maa Elections: “మా” ఎలక్షన్ ప్రచారంలో దూసుకుపోతున్న విష్ణు.. కృష్ణంరాజు తో భేటీ..!!

sekhar
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar