మహా రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ శిండేకి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. శివసేన ఆస్తులకు సంబంధించి శిండే వర్గం దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీం కోర్టు డిస్మిస్ చేసింది. ఈ సందర్భంలో సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమైయ్యాయి. ఇదేమి కేసు అంటూ న్యాయవాదులను ఉద్దేశించి సీజే వ్యాఖ్యానించారంటే ఆయన ఎంత సీరియస్ అయ్యారో అర్దం చేసుకోవచ్చు. మహారాష్ట్రలో శివసేన చీలిక వర్గం నేత ఏక్ నాథ్ శిండే కు పార్టీలోని మెజార్టీ ఎమ్మెల్యేలు మద్దతుగా నిలిచిన నేపథ్యంలో ఉద్దవ్ ఠాక్రే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడం, ఆ తర్వాత బీజేపీతో కలిసి ఏక్ నాథ్ శిండే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

అ తర్వాత అసలైన శివసేన తమదే అంటూ ఇరువర్గాలు న్యాయపోరాటం చేశాయి. తొలుత ఏక్ నాథ్ శిండే, ఉద్దవ్ ఠాక్రే వర్గాలకు వేరువేరు ఎన్నికల గుర్తులు కేటాయించిన ఎన్నికల సంఘం కొద్ది రోజుల క్రితం ఏక్ నాథ్ శిండే శివసేనకు అధికారిక విల్లు గుర్తు కేటాయించింది. శిండే వర్గానికి ఎన్నికల సంఘం నుండి అధికారిక ఎన్నికల గుర్తు రావడంతో, శివసేన ఆస్తులు కూడా తమకే చెందాలని భావించారు. ఉద్దవ్ ఠాక్రే వర్గంలోని ఆస్తులను శివసేన శిండే వర్గానికి బదిలీ చేయాలని శిండే వర్గం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది .దీనిపై విచారణ జరిపిన సుప్రీం కోర్టు పిటిషన్ను కొట్టేసింది. ఇదేమి కేసు అంటూ శిండే తరపు న్యాయవాదులపై సీజే ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలిసింది.
Rajikanth Bala Krishna: రజినీ – బాలయ్య అప్యాయ పలకరింపులు