జర్నలిస్ట్ మహమ్మద్ జుబైర్ కు బిగ్ రిలీఫ్ ఇచ్చిన సుప్రీం కోర్టు

Share

ప్రముఖ జర్నలిస్ట్, ఆల్ట్ న్యూస్ సహ వ్యవస్థాపకుడు మహమ్మద్ జుబైర్ కు సుప్రీం కోర్టు బిగ్ రిలీఫ్ ఇచ్చింది. జుబైర్ పై ఉత్తరప్రదేశ్ లో నమోదు అయిన ఆరు కేసుల్లోనూ బెయిల్ మంజూరు చేస్తూ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసం ఆదేశాలు జారీ చేసింది. రూ.20వేల బెయిల్ బాండును పూచికత్తుగా సమర్పించాలని జుబైర్ ను ఆదేశించింది. ఈ రోజు సాయంత్రం 6 గంటల లోపు పూచికత్తు ప్రక్రియ పూర్తి చేసుకుని విడుదల చేయాలని తీహార్ జైలు అధికారులను ఆదేశించింది.

 

ఇదే క్రమంలో యూపీలో నమోదైన కేసులన్నింటినీ ఢిల్లీ పోలీసు విభాగానికి బదిలీ చేస్తూ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. జుబైర్ ట్వీట్లపై దర్యాప్తునకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ ను రద్దు చేసింది. ఈ వ్యవహారానికి సంబంధించి జుబైర్ పై ప్రస్తుతం నమోదైన కేసులతో పాటు భవిష్యత్తులో నమోదయ్యే ఎఫ్ఐఆర్ లు సైతం ఢిల్లీకి బదిలీ అవుతాయని స్పష్టం చేసింది. తనపై నమోదైన ఎఫ్ఐఆర్ లను రద్దు చేయాలని కోరుతూ జుబైర్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించవచ్చని సుప్రీం కోర్టు తెలిపింది.

ఒక వర్గం మనోభావాలను దెబ్బతీసే విధంగా 2018లో ట్వీట్ చేశారన్న అబియోగంపై నమోదు అయిన కేసులో ఆయనను ఢిల్లీ పోలీసులు గత నెల 27వ తేదీన అదుపులోకి తీసుకున్నారు. అయిదు రోజుల పోలీసు కస్టడీ విచారణ అనంతరం ఈ నెల2వ తేదీన ఢిల్లీ కోర్టులో పోలీసులు హజరుపర్చారు. ఈ సమయంలో జుబైర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన సమయంలో ఢిల్లీ పోలీసులు ఆయనపై నేరపూరిత కుట్ర, ఆధారాల చెరిపివేత సహా విదేశీ విరాళాల చట్ట ప్రకారం మరిన్ని సెక్షన్లు చేర్చినట్లు కోర్టుకు వివరించారు. దీంతో ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టు బెయిల పిటిషన్ ను కొట్టివేసి 14 రోజులు రిమాండ్ విధించింది.

ఈ కేసులో మరో మారు ఢిల్లీ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా గత శుక్రవారం విచారణ జరిపిన కోర్టు.. బెయిల్ మంజూరు చేసింది. రూ.50వేల పూచికత్తు సమర్పించాలని ఆదేశించింది. ఇదే క్రమంలో జుబైర్ కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని స్పష్టం చేసింది ఢిల్లీ కోర్టు. కాగా జుబైర్ పై  యుపీలో నమోదు అయిన ఆరు కేసుల్లో ఈ రోజు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది.


Share

Recent Posts

ఏపి, తెలంగాణలకు కేంద్రం షాక్..విద్యుత్ కోతలు తప్పవా..?

విద్యుత్ బకాయిలు చెల్లించకపోవడంతో తెలంగాణ, ఏపి సహా 13 రాష్ట్రాల విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) ఇంధన ఎక్సేంజీ ల నుండి జరిపే రోజు వారీ కరెంటు…

46 నిమిషాలు ago

అమెరికా వెళ్ళిపోయిన సౌందర్య కుటుంబం… కార్తీక్ ను కలిసిన దీప..!

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ 1435 వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది. ఇక ఈరోజు ఆగస్టు 19 న ప్రసారం కానున్నా ఎపిసోడ్…

49 నిమిషాలు ago

Intinti Gruhalakshmi 19August: సామ్రాట్ ముందే నందు, లాస్య తులసిని తిడుతున్న మౌనంగా ఉండిపోయడా..

తులసి పక్కకి వచ్చి నందు కూర్చుని హాయ్ మామ్ గుడ్ ఈవెనింగ్ అంటాడు తులసి ఏం మాట్లాడుకోకుండా సైలెంట్ గా ఉంటుంది మొన్న ఒక న్యూస్ పేపర్…

2 గంటలు ago

మెగాస్టార్ బర్తడే సందర్భంగా మెగా ఈవెంట్ ప్లాన్ చేసిన నాగబాబు..!!

వచ్చేవారం మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా మెగా ఫాన్స్ రకరకాల కార్యక్రమాలు నిర్వహించడానికి రెడీ అవుతున్నారు. గత రెండు సంవత్సరాలు కరోనా కారణంగా పెద్దగా జరపలేదు. అయితే…

4 గంటలు ago

ఆగస్టు 19 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 19 – శ్రావణమాసం - శుక్రవారం మేషం దైవ చింతన పెరుగుతుంది.ఉద్యోగవిషయమై అధికారులతో చర్చలు ఫలిస్తాయి.ఇంటా బయట కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో…

6 గంటలు ago

ఆ మూవీని రూ. 75 వేల‌తో స్టార్ట్ చేసిన పూరి.. చివ‌ర‌కు ఏమైందంటే?

టాలీవుడ్ టాప్ డైరెక్ట‌ర్ల లిస్ట్ తీస్తే.. అందులో పూరి జ‌గ‌న్నాథ్ పేరు ఖ‌చ్చితంగా ఉంటుంది. దూరదర్శన్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించి పూరి జ‌గ‌న్నాథ్‌.. ఆ త‌ర్వాత…

6 గంటలు ago