BBC Documentary row: బీబీసీ డాక్యుమెంటరీ వివాదంపై దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు విచారణ జరిపింది. ఆ డాక్యుమెంటరీని బ్యాన్ చేస్తూ తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన ఒరిజినల్ రికార్డులను సమర్పించాలని కేంద్రానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. మూడు వారాల్లో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రానికి సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చింది. బీబీసీ డాక్యుమెంటరీని చూసే పౌరులను ప్రభుత్వం అరెస్టు చేస్తొందనీ, దీనిపై బ్యాన్ విధించడం భావ ప్రకటనా స్వేచ్చ కు విరుద్దమేనని పేర్కొంటూ సీనియర్ జర్నలిస్ట్ రామ్, టీఎంసీ ఎంపీ మహువా మెయిత్రా, సామాజిక కార్యకర్త, న్యాయవాది ప్రశాంత్ భూషణ్, మరో న్యాయవాది ఎంఎల్ శర్మ దాఖలు చేసిన పిటిషన్ల పై శుక్రవారం జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎంఎం సుందరేష్ తో కూడిన సుప్రీం ధర్మాసనం విచారణ జరిపింది. కేంద్ర ప్రభుత్వంతో పాటు మరి కొందరికీ నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ నాటికి ఆ డాక్యుమెంటరీ పై నిషేదానికి సంబంధించిన ఒరిజినల్ రికార్డులను కోర్టుకు సమర్పించాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఏప్రిల్ కు వాయిదా వేసింది.

ఇండియా: ది మోడీ క్వశ్చన్ అనే పేరుతో 2002 గుజరాత్ అల్లర్లపై బీబీసీ ఇటీవల రూపొందించిన డాక్యుమెంట్ ను యూట్యూబ్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాలు నెటిజన్లకు అందుబాటులో ఉంచాయి. ఇది వివాదాస్పదమైనవిగా భావించిన కేంద్ర ప్రభుత్వం.. ఆ లింక్ లను వెంటనే తొలగించాలని జనవరి 21న ఆయా సామాజిక మాధ్యమాలను ఆదేశించింది. ఈ డాక్యుమెంటరీ తప్పుదారి పట్టించే విధంగానూ, కుట్రపూరితంగానూ ఉందని, రాజ్యాంగ విరుద్దమని కేంద్రం పేర్కొంది. ఈ డాక్యుమెంటరీ పై మన దేశంలో బీజేపీ వర్గాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు తీవ్ర విమర్శలు గుప్పించాయి. అయితే కేంద్రం తీసుకున్న చర్య మీడియా స్వేచ్చకు, సమాచారం తెలుసుకునేందుకు ప్రజలకు ఉన్న హక్కును కాలరాయడమేనని విమర్శలు వ్యక్తమైయ్యాయి. ఆమెరికా సహా పలు దేశాలు ఈ చర్యలను తప్పుబట్టాయి. ఈ నేపథ్యంలో బీబీసీ డాక్యుమెంటరీ నిషేదంపై సుప్రీం కోర్టులో పలు పిటిషన్లు దాఖలైయ్యాయి. అయితే కేంద్రం నిషేదం తర్వాత కూడా కేరళతో పాటు ఢిల్లీ యూనివర్శిటీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ వంటి కొన్ని చోట్ల ఈ డాక్యుమెంటరీని ప్రదర్శించారు.
Adani Enterprises Rout Row: ఫిబ్రవరి 6న కాంగ్రెస్ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా నిరసనలు