Supreme Court key orders on gyanvapi masjid case
Supreme Court: ఉత్తరప్రదేశ్ వారణాసిలోని జ్ఞానవాపి మసీదు సర్వేపై దాఖలైన పిటిషన్ ను విచారించిన సుప్రీం కోర్టు ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. ట్రయల్ కోర్టులో విచారణ పూర్తి అయ్యే వరకూ వేచి చూడాలని పిటిషనర్ కు సుప్రీం కోర్టు సూచించింది. శివలింగం ఉన్న ప్రాంతానికి రక్షణ కల్పించాలని జిల్లా మెజిస్ట్రేట్ ను ఆదేశించిన సుప్రీం ధర్మాసనం.. నమాజ్ చేసుకునేందుకు అనుమతించాలని తెలిపింది. తదుపరి విచారణను ఈ నెల 19వ తేదీకి వాయిదా వేస్తూ ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది సుప్రీం కోర్టు.
వివరాల్లోకి వెళితే.. వారణాసిలోని ప్రఖ్యాత కాశీ విశ్వనాధుని ఆలయ సమీపంలో జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్ ఉంది. ఈ కాంప్లెక్స్ లో మసీదు వెనుక పూర్వం ఆలయం ఉండేదని, అక్కడ నిత్య పూజలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ అయిదుగురు మహిళలు స్థానిక కోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన వారణాసి కోర్టు ఆ ప్రాంతంలో వీడియో సర్వే చేయాలని ఆదేశించింది. దీనికి గానూ కోర్టు ఓ కమిటినీ నియమించింది. కోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 6వ తేదీన కమిటీ సర్వేకు వెళ్లగా మసీదు ప్రాంగణంలో వీడియో మసీదు కమిటీ పెద్దలు అడ్డుకున్నారు. దీంతో సర్వే ఆగిపోయింది. తదుపరి మరల కోర్టు ఆదేశాల మేరకు భారీ పోలీస్ బందోబస్తు నడుమ శనివారం నుండి జ్ఞానవాపి కాంప్లెక్స్ లో మూడు రోజులు వీడియో గ్రఫీ సర్వే చేశారు. సోమవారం ఉదయానికి సర్వే పూర్తి చేశారు. జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్ లోని బావిలో నీటిని తోడుగా అందులో శివలింగం బయటపడినట్లు హిందు మహిళల తరపున న్యాయవాది సుభాష్ నందన్ చదుర్వేది వెల్లడిస్తూ శుద్ధి కార్యక్రమం కోసం వాడుకుంటున్న ఈ బావిని సీల్ చేయాలని కోర్టును ఆశ్రయించారు. శివలింగం బయటపడిన ప్రాంతాన్ని సీల్ చేసి భద్రత కల్పించాలని కోర్టు ఆదేశించింది. అయితే ఈ సర్వేను వ్యతిరేకిస్తూ జ్ఞానవాపి మసీదు కమిటీ సుప్రీం కోర్టును ఆశ్రయించగా మంగళవారం జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ పిఎస్ నరసింహాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం పిటిషన్ ను విచారించింది.
మరో పక్క జ్ఞానవాపి మసీదు వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సర్వే కోసం నియమించిన కమిషన్ లోని ముగ్గురు సభ్యుల్లో ఒకరైన అజయ్ మిశ్రాను కమిటి నుండి తొలగించింది స్థానిక కోర్టు. సర్వే సమాచారాన్ని లీక్ చేస్తున్నారన్న అభియోగంతో ఆయనను తొలగించింది. సర్వే నివేదిక సమర్పించేందుకు కమిషన్ కు రెండు రోజులు సమయం ఇచ్చింది.
Dil Raju: టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ నిర్మాతలలో దిల్ రాజు(Dil Raju) ఒకరు. తన బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్…
Today Horoscope: జూలై 5 - అషాడమాసం - మంగళవారం మేషం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో…
Samantha Tapsee: హీరోయిన్ తాప్సి(Tapsee) అందరికీ సుపరిచితురాలే. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు(Raghavendra Rao) దర్శకత్వంలో మంచు మనోజ్(Manoj) హీరోగా నటించిన "ఝుమ్మంది…
God Father: మలయాళంలో మోహన్ లాల్(Mohan Lal) ప్రధాన పాత్రలో నటించిన "లూసిఫర్"(Lucifer) తెలుగులో "గాడ్ ఫాదర్"(God Father)గా తెరకెక్కుతోంది.…
Ram Pothineni Boyapati: బోయపాటి(Boyapati Srinivas) దర్శకత్వంలో రామ్ పోతినేని(Ram Pothineni) సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రామ్ కెరియర్…
Upasana: ప్రముఖ ఆధ్యాత్మిక గురువు సద్గురు(Sadguru) ప్రపంచవ్యాప్తంగా సేవ్ సాయిల్ పేరిట పర్యటనలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో…