NewsOrbit
జాతీయం న్యూస్

Supreme Court: రాజీవ్ హత్య కేసులో సుప్రీం కోర్టు సంచలన తీర్పు .. ఓ దోషికి బిగ్ రిలీఫ్  

Supreme Court: మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ హత్య కేసులో సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. జీవిత ఖైదు అనుభవిస్తున్న దోషుల్లో ఒకరికి సుప్రీం కోర్టు బిగ్ రిలీఫ్ ఇచ్చింది. ఇందుకోసం ఆర్టికల్ 142 కింద అసాధారణ అధికారాన్ని సుప్రీం కోర్టు ఉపయోగించింది. 31 సంవత్సరాలుగా ఏజి పెరరివలన్ రాజీవ్ హత్య కేసులో జైలు శిక్ష అనువిస్తున్న పెరారివలన్ ను విడుదల చేయాలని సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చింది.

Supreme Court key orders on rajiv Gandhi assassination case
Supreme Court key orders on rajiv Gandhi assassination case

30 ఏళ్లకు పైగా జైలు శిక్ష అనుభవిస్తుండటంతో..

1991 మే 21 రాత్రి తమిళనాడులోని శ్రీపెరంబుదూర్ లో ఎన్నికల ర్యాలీలో రాజీవ్ గాంధీని హత్య చేశారు. అదే యేడాది జూన్ 11న చెన్నైలో పెరరివలన్ ను అరెస్టు చేశారు. రాజీవ్ గాంధీ హత్యకు వాడిన పేలుడు పరికరాలను అందించారన్న అభియోగంపై పెరరివలన్ ను పిన్న వయస్సులో అరెస్టు చేశారు. ఈ కేసులో పెరారివలన్, మురుగన్, సంతన్, నళినిలకు దిగువ కోర్టు విధించిన మరణశిక్షను సుప్రీం కోర్టు సమర్ధించింది. ఆ తరువాత వారి క్షమాభిక్ష పిటిషన్ పై కేంద్రం నిర్ణయం తీసుకోవడంలో 11 ఏళ్ల జాప్యం కారణంగా సంతన్, మురుగన్, పెరారివలన్ మరణశిక్షను సుప్రీం ధర్మాసనం 2014లో జీవిత ఖైదుగా మార్చింది.

Supreme Court: ఆర్టికల్ 142 ప్రకారం

కాగా 30 ఏళ్లకు పైగా జైలు శిక్ష అనుభవిస్తున్న పెరారివలన్ (47) తన జీవిత ఖైదును సస్పెండ్ చేయాలని కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా ఈ పిటిషన్ విచారించిన జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు ఆధ్వర్యంలోని ధర్మాసనం కీలక ఆదేశాలు ఇచ్చింది.  ఆర్టికల్ 142 ప్రకారం దోషిని విడుదల చేయడం సముచితమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. పెరోల్ పై బయటకు వచ్చినప్పుడు ఎటువంటి ఫిర్యాదుల చరిత్ర లేకపోవడంతో పాటు సుదీర్ఘమైన జైలు శిక్షను పరిగణలోకి తీసుకున్న సుప్రీం కోర్టు ఈ ఏడాది మార్చి 8న పెరారివలన్ కు బెయిల్ మంజూరు చేసింది. తాజాగా ఇప్పుడు పెరారివలన్ విడుదలకు సుప్రీం ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది.

author avatar
sharma somaraju Content Editor

Related posts

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!