ఎన్నికల కమిషనర్ల నియామకాలపై సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ప్రధాని, ప్రతిపక్ష నేత, సీజేఐ సభ్యులుగా ఉన్న కమిటీనే నియమించాలని ఆదేశించింది. కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్లు (ఈసీ), ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) నియామకాలకు కూడా కొలీజియం తరహా వ్యవస్థ ఉండాలంటూ దాఖలైన పిటిషన్ల పై సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ కెఎం జోసెఫ్ నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం గురువారం తీర్పు వెలువరించింది. ఆ పిటిషన్లపై గత నవంబర్ నెలలోనే వాదనలు ముగియగా ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది. మాజీ అధికారి అరుణ్ గోయల్ ను ఎన్నికల కమిషనర్ గా నియమించే దస్త్రం 24 గంటల్లో అన్ని విభాగాల నుండి వాయువేగంతో అనుమతి పొందడంలో ఔచిత్యాన్ని సుప్రీం కోర్టు గతంలోనే ప్రశ్నించింది. అసలైన దస్త్రాన్ని సమర్పించడానికి ప్రభుత్వ అభ్యంతరాలను దర్మాసనం తోసిపుచ్చింది.

కేంద్ర ఎన్నికల కమిషన్ నియామక వ్యవస్థలో ప్రస్తుత నియామక విధానాన్ని సుప్రీం కోర్టు రద్దు చేసింది. ఎలక్షన్ కమిషనర్ల ఎంపిక కోసం కమిటీని ఏర్పాటు చేసింది. ప్రధాన మంత్రి, ప్రతిపక్ష నేత, సీజెఐ సభ్యులుగా ఉన్న కమిటీనే నియమించాలని ఆదేశించింది. ప్రతిపక్ష నేత లేకపోతే విపక్షంలో మెజార్టీ పార్టీ సభ్యుడు కమిటీలో ఉండాలని తెలిపింది. కమిటీ సిఫార్సుల మేరకే ఈసీలను రాష్ట్రపతి నియమించాలని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. సీబీఐ చీఫ్ ఎంపిక తరహాలోనే సీఈసీ నియామకం జరగాలని సూచించింది. దీనికి సంబందించి పార్లమెంట్ చట్టం చేసేంత వరకూ కమిటీ పని చేస్తుందని జస్టిస్ కెఎం జోసెఫ్ నేతృత్వంలోని అయిదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది.
సీఎం వైఎస్ జగన్ విశాఖలో అడుగు పెడుతున్న వేళ .. అమరావతి రాజధాని కేసులో కీలక పరిణామం..?
