జాతీయం

కుక్క కాటుకి కోర్టు దెబ్బ: వీధి కుక్కలకు ఆహారం ఇవ్వడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది, అలా చేసేవారికి తిప్పలు తప్పవు

Stray Dogs Culling Case in Supreme Court
Share

Supreme Court on Stray Dogs /వీధి కుక్కల బెడద: జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ జేకే మహేశ్వరిలతో కూడిన ధర్మాసనం వీధి కుక్కల బెడదకు సంబంధించిన కేసులో కీలక వాక్యాలు చేసింది. అసలు ఈ వీధి కుక్కల బెడద సూప్రీంకోర్టు దాకా ఎలా వెళ్లిందో తెలుసుకుందాము.

 

Stray Dogs Bite Case
వీధి కుక్కల బెడద: జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ జేకే మహేశ్వరిలతో కూడిన ధర్మాసనం వీధి కుక్కల బెడదకు సంబంధించిన కేసులో కీలక వాక్యాలు చేసింది.

 

ప్రతి సంవత్సరం కుక్క కాటు వలన 100 మందికి రేబిస్

ఈ విషయం సూప్రీంకోర్టు దాకా వొచ్చింది అంటె దానికీ ముందు హైకోర్టు గడప దాటి రావాల్సిందే కదా? వీధి కుక్కల కల్లింగ్(culling) అంటే ఎంపిక చేసిన వధ ద్వారా వీధి కుక్కల జనాభా తగ్గింపు. దీనికి సంబంధించి కొన్ని మునిసిపల్ బోర్డులు తీసుకున్న వీధి కుక్కల జనాభా తగ్గింపు చెరియలపై అప్పీల్ చేస్తూ హైకోర్టులను ఆశ్రయించిన NGOs నిరాశ ఎదురైంది. బొంబాయి హైకోర్టు జంతు సంక్షేమ సంస్థల అభ్యర్థనకు వ్యతిరేకంగా వీధి కుక్కల జనాభా తగ్గింపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

అయితే ఈ తీర్పుకు వ్యతిరేకంగ జంతు సంక్షేమ NGOs సుప్రీంకోర్టును రంగంలోకి దింపారు. ఉన్నపాటుగా ఒకేసారి కుక్కలను అలా చంపటం సబబు కాదని అది జంతువులపై క్రూరత్వం కింద పరిగణించవొచ్చు అని ఈ సంస్దల వాదన.

ఇటీవలే ఫిషరీస్, పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమ మంత్రి పర్షోత్తమ్ రూపాలా లోక్‌సభలో మాట్లాడుతూ జాతీయ పశుగణన వివరాల ఆధారంగా 2012 నుండి 2019 కాలంలో వీధి కుక్కల జనాభా పది శాతం తగ్గింది అని గర్వంగా వ్యక్తపరిచారు. ఇది కేరళ మరియు మహారాష్ట్రలో పెరుగుతున్న వీధి కుక్క దాడుల గురించి తలెత్తిన ప్రెశ్నలకు మంత్రి జవాబు చెప్ప చేసిన ప్రయత్నం. మ్యాటర్ అంత సీరియస్ అన్నమాట.

Supreme Court on Feeding Street Dogs
Supreme Court on Feeding Street Dogs

అయితే తాజాగా జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ జేకే మహేశ్వరిలతో కూడిన ధర్మాసనం వీధి కుక్కల బెడదకు సంబంధించిన కేసులో కీలక వాక్యాలు చేసింది. ఎవరైతే వీధి కుక్కలకు ఆహారం పెడతారో వాళ్ళు ఆ కుక్కకు సంబంధించిన అన్ని బాధ్యతులు తీసుకోవాలి, ఆ వీధి కుక్క ఎవరినైనా కరిస్తే ఆ మనిషి ట్రీట్మెంట్ ఖర్చు చూసుకోవాలి, అంతె కాదు ఆ వీధి కుక్కకు వాక్సినేషన్ చేయించే బాధ్యత కూడా వీరిదే అని ధర్మాసనం పేర్కొంది. ఈ కేసుకు సంబంచిన మరిన్ని వివరాలు సెప్టెంబర్ 28న వింటాం అని వాయిదా వేసింది.

అతి ఎక్కువ వీధి కుక్కల జనాభా ఉన్న రాష్ట్రం ఇది

దేశంలోనే అతి ఎక్కువ కుక్కలు ఉన్న రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. అతి తక్కువ వీధి కుక్కలు ఉన్న రాష్ట్రం అస్సాం

వీధి కుక్కల బెడద: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వీధి కుక్కల జనాభా ఎంతో తెలుసా?

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ కలిపి దేశంలోని మొదటి పది స్థానాలలో చోటు దక్కిచుకుంది. జాతీయ జంతు గణనాలు ప్రకారం AP + Telangana కలిపి మొత్తం 8.5 కోట్ల వీధి కుక్కలు ఉన్నాయి.

Stray Dogs Culling Case Judgement
Supreme Court on Stray Dogs Culling Case

జంతువులపై క్రూరత్వం నిరోధక చట్టం, 1960 ఏమంటుంది ?

Prevention of Cruelty to Animals Act, 1960 లేదా జంతువులపై క్రూరత్వం నిరోధక చట్టం, 1960 ఆర్టికల్ 48A కింద స్టేట్ పాలసీ డైరెక్టివ్ ప్రిన్సిపల్ ని పెరిగినలోకి తీసుకొని తయారు చేయబడింది. Article 48A ప్రకారం “పర్యావరణాన్ని రక్షించడానికి మరియు మెరుగుపరచడానికి మరియు దేశంలోని అడవులు మరియు వన్యప్రాణులను రక్షించడానికి రాష్ట్రం ప్రయత్నిస్తుంది.”

భారత రాజ్యాంగం ప్రకారం భారత పౌరుడి ప్రాథమిక విధులలో ఒకటి : పౌరుడి ప్రాథమిక విధులు Vs వీధి కుక్కలు

“అడవులు, సరస్సులు, నదులు మరియు వన్యప్రాణులతో సహా సహజ పర్యావరణాన్ని రక్షించడం మరియు మెరుగుపరచడం మరియు అన్ని జీవుల పట్ల కరుణ కలిగి ఉండటం భారతదేశంలోని ప్రతి పౌరుడి విధి.”

దీని అర్ధం వీధి కుక్కలు పెరిగిపోయి దాడి చేస్తుంటే చూస్తూ కూర్చోమని కాదు. ఈ విషయం పై సుప్రీంకోర్టు త్వరలో స్పష్టత ఇవ్వనుంది, వేచి చూద్దాం .

 

 

 


Share

Related posts

సాగు చట్టాలపై కేంద్రం కీలక ప్రతిపాదన..సమయం కోరిన రైతు సంఘాలు

somaraju sharma

BJP : బీజేపీకి బ్యాడ్ న్యూస్! ఎన్నికలు జరిగే ఐదు రాష్ర్టాల్లో రెండే ఆ పార్టీకి అట!!

Yandamuri

Panjab: బిగ్ బ్రేకింగ్..పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ రాజీనామా..

somaraju sharma