జాతీయం న్యూస్

Supreme Court: జహీంగీర్‌పురిలో అక్రమ నిర్మాణాల కూల్చివేతకు సుప్రీం కోర్టు బ్రేక్..

Share

Supreme Court: దేశ రాజధాని ఢిల్లీలోని జహీంగీర్‌పురిలో అక్రమ నిర్మాణాల తొలగింపు నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జహీంగీర్‌పురి ప్రాంతంలో అక్రమ నిర్మాణాల కూల్చివేత కార్యక్రమాన్ని ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ అధికారులు చేపట్టారు. పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించి ప్రొక్లైయిన్ తో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. ఈ సందర్బంగా అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలోనే కొందరు స్థానికులు సుప్రీం కోర్టును ఆశ్రయించగా..నిర్మాణాల కూల్చివేత డ్రైవ్ ను వెంటనే నిలిపివేయాలనీ, యథాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసింది. నికి సంబంధించిన విచారణను రేపు చేపడతామని సుప్రీం కోర్టు తెలిపింది. మరో పక్క స్థానిక కార్పోరేషన్ అధికారుల చర్యలపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

Supreme Court orders status-quo on demolition drive on North Delhi
Supreme Court orders status-quo on demolition drive on North Delhi

Supreme Court: ఈ డ్రైవ్ రోజువారీ కార్యక్రమాల్లో భాగమే

రెండు రోజుల క్రితం జహీంగీర్‌పురిలో రెండు వర్గాల ఘర్షణల నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నారు. ఈ నేపథ్యంలో అల్లరిమూకల ఆక్రమ నిర్మాణాలు కూల్చివేయాలని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు అదేశ్ గుప్తా మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ కు లేఖ రాశారు. ఆ తరువాత మున్సిపల్ కార్పోరేషన్ అధికారులు అక్రమ నిర్మాణాల కూల్చివేత డ్రైవ్ ప్రారంభించారు. అయితే ఈ డ్రైవ్ రోజువారీ కార్యక్రమాల్లో భాగమేననీ మేయర్ రాజా ఇక్బాల్ సింగ్ వెల్లడించారు. బీజేపీ నేత లేఖ రాసిన తరువాత అక్రమ నిర్మాణాల కూల్చివేత డ్రైవ్ ప్రారంభించడంపై విపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. కాగా సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు తాము ఈ కూల్చివేత ప్రక్రియ నిలిపివేశామని మేయర్ ఇక్బాల్ సింగ్ వెల్లడించారు.

‘బుల్డోజర్లను ఆపివేసి పవర్ ప్లాంట్లను ఆన్ చేయండి’

ఢిల్లీలో అక్రమ నిర్మాణాల తొలగింపు డ్రైవ్ పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఘాటుగా స్పందించారు. కేంద్రంపై ఆయన మండిపడ్డారు. వెంటనే ధ్వేషపూరిత బుల్డోజర్లను ఆపివేయండని విమర్శించారు. ఈ ఎనిమిది సంవత్సరాల పాలన ఫలితంగా కేవలం 8 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నాయి మోడీజీ..ద్రవ్యోల్బణం ఆకాశాన్నంటుతోంది. విద్యుత్ కోత చిన్న పరిశ్రమలను ధ్వంసం చేస్తోంది. ఇది మరింత నిరుద్యోగానికి దారి తీస్తుంది. అందుకే ద్వేషపూరిత బుల్డోజర్లను ఆపివేసి పవర్ ప్లాంట్లను ఆన్ చేయండి అంటూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.

 


Share

Related posts

Shilpa Manjunath Cute Smile Images

Gallery Desk

Surekha Vani: అప్పట్లో హేమ మొన్న కరాటే కళ్యాణి ఈ సారి సురేఖ వాణి..??

sekhar

రోజు రోజుకి టీడీపీలో పడిపోతున్న లోకేష్ గ్రాఫ్..!!

sekhar
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar