Nupur Sharma Row: మహామ్మద్ ప్రవక్త (prophet remarks)పై వివాదాస్పద వ్యాఖ్యలతో అంతర్జాతీయ స్థాయిలో దుమారానికి కారణమైన బీజేపీ (BJP) బహిష్కృత నాయకురాలు నుపుర్ శర్మ (nupur Sharma) పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది సుప్రీం కోర్టు (Supreme Court). ఆమె అభ్యర్ధనను తిరస్కరించింది. ఆమె చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల దేశానికి క్షమాపణలు చెప్పాలని ఆదేశించింది. తనకు ఉన్న ప్రాణ హాని, అత్యాచార బెదిరింపుల నేపథ్యంలో దేశ వ్యాప్తంగా తనకు వ్యతిరేకంగా దాఖలైన కేసుల ఎఫ్ఐఆర్ లను ఢిల్లీకి బదిలీ చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ ఆమె సుప్రీం కోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేయగా, దానిపై శుక్రవారం జస్టిస్ సూర్యకాంత్ మిశ్ర ధర్మాసనం విచారణ జరిపింది.
ఈ సందర్భంగా నుపుర్ శర్మపై తీవ్ర స్థాయిలో మండిపడింది. “పార్టీకి అదికార ప్రతినిధి అయితే ఇష్టానుసారంగా మాట్లాడతారా..? మీలాంటి వ్యక్తులకు ఏ మతంపైనా గౌరవం లేదు. సుపుర్ శర్మ వ్యాఖ్యలు ఆమె అహంకారాన్ని తెలియజేస్తున్నాయి. ఆ కార్యక్రమం నిర్వహించిన ఛానల్ పైనా ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సి ఉంది” అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా ప్రజల మనోభావాలను రెచ్చగొట్టేలా ఉన్నాయనీ, ఆ వ్యాఖ్యల వల్లే ఉదయ్ పూర్ ఘటన కూడా జరిగిందనీ, దేశంలో ఏమి జరిగినా దానికి వారే బాధ్యత వహించాలని ధర్మాసనం పేర్కొంది.
నుపుర్ శర్మ తరపున సీనియర్ న్యాయవాది మణిందర్ సింగ్ మాట్లాడుతూ తను చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే నుపుర్ శర్మ క్షమాపణలు చెప్పారనీ, తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకున్నారని చెప్పారు. అయితే ఆమె టీవీ ముందరకే వచ్చి యావత్ దేశానికి క్షమాపణలు చెప్పాల్సి ఉందని కానీ ఇప్పటికే ఆలస్యం అయ్యిందని సుప్రీం తెలిపింది. తన ప్రాణాలకు ముప్పు ఉందని నుపుర్ శర్మ తరపు న్యాయవాది సుప్రీం కోర్టులో చెప్పగా జస్టిస్ సూర్యకాంత్ మిశ్ర కలగజేసుకుని “ఆమెకు ముప్పు ఏర్పడిందా..? ఆమె వల్ల దేశం రగిలిపోతోంది” అంటూ మండిపడ్డారు.
ఇదే క్రమంలో ఢిల్లీ పోలీసులను నిలదీసింది సుప్రీం కోర్టు. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మీద ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. మరి ఆమెపై ఎన్నో ఎఫ్ఐఆర్ లు నమోదు అయినా ఎందుకు ఆమెను టచ్ చేయలేకపోయారని ఢిల్లీ పోలీసులను సుప్రీం కోర్టు నిలదీసింది. ఫిర్యాదులు నమోదు అయిన తరువాత ఢిల్లీ పోలీసులు ఏమి చేశారని ప్రశ్నించింది. ఆమె సరిదిద్దుకోలేని పొరపాటు చేశారని ధర్మాసనం అభిప్రాయపడింది. నుపుర్ శర్మ దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టేస్తూ.. ఈ కేసులో సంబంధిత హైకోర్టును ఆశ్రయించాలని సుప్రీం కోర్టు సూచించింది.
నాగార్జున వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అఖిల్ అక్కినేని.. కెరీర్ స్టార్టింగ్‌లో వరుస ఫ్లాపులను మూడగట్టుకున్నాడు. ఈయన నుండి వచ్చిన `అఖిల్`, `హలో`, `మిస్టర్ మజ్ను` చిత్రాలు…
విభిన్నమైన కథలతో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్.. త్వరలోనే `కార్తికేయ 2`తో పలకరించబోతున్నాడు.…
బీహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ నేత నితీష్ కుమార్ 8వ సారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటి వరకూ నితీష్ కుమార్ ఏడు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం…
గత కొద్ది నెలల నుండి సినిమాల ద్వారా వచ్చే ఆదాయం బాగా తగ్గిపోవడం, నిర్మాణ వ్యయం మోయలేని భారంగా మారడంతో.. తెలుగు సినీ నిర్మాతలు తమ సమస్యలను…
జేడీయూ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మిత్రపక్షమైన బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చారు. ఎన్డీఏ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన నితీష్ కుమార్ ఇప్పటి వరకు…
యంగ్ బ్యూటీ కృతి శెట్టి గురించి పరిచయాలు అవసరం లేదు. తక్కువ సమయంలోనే టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్‌గా మారిన ఈ ముద్దుగుమ్మ.. త్వరలోనే `మాచర్ల నియోజవర్గం`తో ప్రేక్షకులను…