ఆదానీ – హిండెన్ బర్గ వ్యవహారంపై విచారణ జరిపేందుకు సుప్రీం కోర్టు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ అభయ్ మనోహర్ సప్రే నేతృత్వంలో ఆరుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. విశ్రాంత న్యాయమూర్తులు జస్టిస్ ఓపీ భట్, జస్టిస్ జేపీ దేవదత్ తో పాటు కార్పోరేట్ దిగ్గజాలు నందన్ నీలేకరి, కేవి కామ్ నాథ్, సోమశేఖరన్ సుందరేశన్ ను కమిటీలో సభ్యులుగా నియమించింది సుప్రీం కోర్టు. రెండు నెలల్లోగా ఈ కమిటీ ధర్మాసనానికి నివేదిక ను సీల్డ్ కవర్ లో సమర్పించాలని ఆదేశించింది.

సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా (సెబీ) నిబంధనల్లో ఉన్న 19 వ సెక్షన్ ను అతిక్రమించారా..? షేర్ల ధరల విషయంలో ఏమైనా అవకతకవకలకు పాల్పడ్డారా..? అనే విషయాలపై దర్యాప్తు చేయాల్సిందిగా సెబీని సుప్రీం కోర్టు ఆదేశించింది. కేంద్ర, ఆర్ధిక సంస్థలు, సెబీ చైర్ పర్సన్ ను కమిటీకి అన్ని విధాలుగా సహకరించాలని సుప్రీం కోర్టు సూచించింది. కాగా సుప్రీం కోర్టు తీసుకున్న ఈ నిర్ణయంపై వ్యాపారవేత్త గౌతమ్ ఆదానీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. నిర్దిష్ట కాల పరిమితిలోగా నివేదిక సమర్పించాలన్న సుప్రీం కోర్టు నిర్ణయాన్ని గౌతమ్ అదానీ స్వాగతించారు. తన కంపెనీపై వచ్చిన ఆరోపణలకు ఇది ముంపు పలుకుతుందని, చివరకు నిజమే గెలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆదానీ – హిండెన్ బర్గ్ వ్యవహారంపై నాలుగు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు సుప్రీంకోర్టులో ధాఖలైయ్యాయి. న్యాయవాదులు ఎమ్ ఎల్ శర్మ, విశాల్ తివారీ, కాంగ్రెస్ నేత జయఠాకూర్, సామాజిక కార్యకర్త ముకేశ్ కుమార్ లు ఈ పిల్ లు దాఖలు చేశారు. వీటిపై విచారణ జరిగిన సీజే జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం.. నిపుణుల కమిటీకి సంబంధించి గతంలో సభ్యుల పేర్లు, విధివిధానాలతో కేంద్రం సమర్పించిన నివేదికను తిరస్కరించింది. విచారణ పారదర్శకంగా సాగేందుకు కమిటీని తామే నియమిస్తామని వ్యాఖ్యానించింది. తాజాగా కమిటిని నియమించింది.
ఏపి సర్కార్ విజ్ఞప్తిని తోసిపుచ్చిన సుప్రీం ధర్మాసనం .. అమరావతి కేసు ఆ రోజునే విచారణ