NewsOrbit
జాతీయం బిగ్ స్టోరీ

Supreme court : పెద్ద పదవి : వీడని మిస్టరీ

Supreme court : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దేశంలోనే అతి పెద్ద పదవి . సాక్షాత్తు రాష్ట్రపతి చేత పదవీ ప్రమాణం చేయించే అధికారం ఆ పదవి ఇచ్చే ఉంది. భారతదేశ అత్యున్నత న్యాయస్థానం కాబోయే నూతన ప్రధాన న్యాయమూర్తి పదవి మీద ఎన్నడూ లేనంత సందిగ్ధత కొనసాగుతోంది.

వచ్చే ఏప్రిల్ చివరి నాటికి ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బొబ్డే పదవీకాలం ముగియనుంది. దీంతో తదుపరి ప్రధాన న్యాయమూర్తి కోసం ఇప్పటికే ఎంపిక లాంచనంగా పూర్తి కావాల్సి ఉండగా ఇప్పటి వరకు కనీసం ఆ ఊసే రాకుండా ఉంది.

Supreme court
Supreme court

Supreme court : బీజేపీ గేమ్ ప్లాన్ లో భాగామ??

ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి బాబ్డే తర్వాత సీనియారిటీ ప్రకారం చూస్తే ఆంధ్రప్రదేశ్కు చెందిన సుప్రీం న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ ఉన్నారు. ఇప్పటివరకు సుప్రీంకోర్టు సంప్రదాయం ప్రకారం ప్రధాన న్యాయమూర్తి తర్వాత సీనియారిటీ ఉన్న వారినే తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన ఇప్పటివరకు జరుగుతోంది. దాదాపు రెండు నెలలకు ముందే ఈ ఎంపిక దాదాపు పూర్తయ్యేది. అయితే ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఎన్వి రమణ నియామకం మీద కేంద్రం అంత సానుకూలంగా లేకపోవడమే ప్రధాన కారణమని తెలుస్తోంది.

రాజ్యాంగం లో లేక!

భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎంపిక మీద రాజ్యాంగంలో ఎలాంటి నిర్దిష్టమైన ఎంపిక విధానం లేదు. దీంతో రిటైర్డ్ న్యాయమూర్తులతో ఉన్న సుప్రీం కొలీజియం న్యాయమూర్తుల సీనియారిటీ ను, ప్రధాన న్యాయమూర్తుల ఎంపికను పర్యవేక్షిస్తోంది. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సుప్రీం కొలీజియం లో మొత్తం ఎనిమిది మంది సభ్యులు ఉంటారు. వీరు కీలక మైన సమయాల్లో సమావేశమై కొలీజియం ఎంపికలు చేయడం సంప్రదాయంగా వస్తోంది.

అయితే ప్రస్తుతం భారత ప్రధాన న్యాయమూర్తి పదవి కాలం దగ్గరపడుతున్న కొలీజియం సభ్యులు సమావేశం కాకపోవడం వెనుక కేంద్ర పెద్దల ప్రభావం ఉందన్న విమర్శలు వస్తున్నాయి. కొలీజియం నిర్ణయాలను ప్రభావం చేసే రాజకీయ కారణాల వల్ల, ఇంక ఈ విషయంలో స్పష్టత వచ్చినట్లు కనిపించడం లేదు.

మితిమీరిన జాప్యం ఎందుకో!

భారత సుప్రీంకోర్టులో మొత్తం 30 మంది న్యాయ మూర్తులు ఉన్నారు. 9 ప్రత్యేక బెంచ్ ల్లో వీరు విభిన్నమైన అంశాల్లో పని చేస్తున్నారు. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శరత్ అరవింద్ బాబ్డే 2013 నుంచి సుప్రీం కోర్టులో పని చేస్తుండగా, ఆయన తర్వాత ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఎన్.వి.రమణ ఉన్నారు. ఎన్.వి.రమణ 2014 ఫిబ్రవరి నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పని చేస్తున్నారు. ఎన్.వి.రమణ తర్వాత జస్టిస్ ఆర్ ఎఫ్ నారీమన్ 2014 జులై లో న్యాయమూర్తిగా వస్తే, సీనియార్టీ లో తర్వాత భాగంలో ఉన్న జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ 2014 ఆగస్టులో సుప్రీం కోర్టుకు వచ్చారు.

సీనియారిటీ లో ముందు పేరున్న రమణకు 2022 ఆగస్టు వరకు పదవీ విరమణ కాలం ఉంది. ఆయన తర్వాత లిస్టులో పేరు ఉన్న నారీమన్ కు ఈ ఏడాది ఆగస్టు నాటికే పదవీ విరమణ చేస్తారు. ఉదయ్ ఉమేష్ లలిత్ సైతం వచ్చే ఏడాది నవంబర్ నాటికి గాని పదవి విరమణ చేయరు. పదవీ కాలాన్ని బట్టి చూస్తే జస్టిస్ ఎన్వీ రమణ కు ఎలాంటి అడ్డంకి లేకున్నా ఆయన నియామకం విషయంలో మాత్రం కొన్ని అడ్డంకులు కనిపిస్తున్నాయి.

** దీంతోపాటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనూ, అమరావతి భూముల విషయంలో నూ జస్టిస్ ఎన్వి రమణ కుటుంబ సభ్యుల పేర్లు రావడం కూడా ప్రతికూల అంశం అయ్యింది. దీంతో పాటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుతో దగ్గరి సంబంధాలు ఉన్నాయి కలిగి ఉన్నారన్న చర్చ ఢిల్లీ సర్కిల్ లలో తరచూ వినిపిస్తూ ఉండడం కూడా ఎన్.వి.రమణ నియామకానికి రాజకీయ పరమైన అడ్డంకులు కల్పించింది అనడంలో సందేహం లేదు. అయితే ఈ విషయంలో బీజేపీ కీలక నేతలు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా మరొకరిని నియమించే పనిలో ఉన్నారని వాదనా లేకపోలేదు. దీంతోనే కొలీజియం సమావేశం ఇప్పటివరకు జరగలేదు అని, అన్నీ లాంఛనాలు పూర్తి అయి రాజకీయంగానూ స్పష్టమైన నిర్ణయం తీసుకున్న తర్వాతే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి విషయంలో ఒక పేరు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది.

author avatar
Comrade CHE

Related posts

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

Lok sabha Elections 2024: నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల .. ఏపీ, తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం

sharma somaraju

Ayodhya: అయోధ్య రామాలయంలో అద్భుత దృశ్యం .. సూర్య తిలకాన్ని దర్శించి తరించిన భక్తులు

sharma somaraju

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు సుప్రీం కోర్టులో దక్కని ఊరట

sharma somaraju

Lok Sabha Elections: అస్సాంలోని ఈ పెద్ద కుటుంబంలో 350 మంది ఓటర్లు ..ఆ కుటుంబ ఓట్ల కోసం అభ్యర్ధుల ప్రయత్నాలు

sharma somaraju

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Lok sabha Elections 2024: ప్రధాని మోడీ విమర్శలపై ఘాటుగా స్పందించిన మల్లికార్జున ఖర్గే .. రిప్లై ఇలా..

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్ కేసులో ప్రధాన నిందితుల అరెస్టు ..టోపీ ఆధారంగా నిందితుల పట్టివేత

sharma somaraju

Delhi Liquor Scam: కవితను కోర్టులో హజరుపర్చిన సీబీఐ .. కస్టడీపై ముగిసిన వాదనలు

sharma somaraju

Lok Sabha Elections 2024: బీజేపీపై ఆ సామాజిక వర్గాలు గుస్సా .. ఎందుకంటే..?

sharma somaraju

Kejriwal: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పీఎపై వేటు ..ఎందుకంటే..?

sharma somaraju

Telangana Lok Sabha Elections 2024: ఆ మూడు స్థానాల్లో కొనసాగుతున్న సస్పెన్స్ .. మరో సీఎం రేవంత్ హస్తినకు పయనం

sharma somaraju

TMC Vs BJP: ముద్దు రేపిన మంట .. టీఎంసీ వర్సెస్ బీజేపీ

sharma somaraju

Lok Sabha Elections 2024: రాజకీయ పార్టీలు ఇకపై ఆ నిబంధనలు పాటించాల్సిందే .. ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju