NewsOrbit
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

పార్లమెంట్ ఆవరణలో సస్పెండైన ఎంపీలు ఇలా..

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం అయినప్పటి నుండి ఉభయ సభల్లో విపక్షాలు ఆందోళనలు కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ధరల పెరుగుదల, నిత్యావసర వస్తువులపై జీఎస్టీ, ద్రవ్యోల్బణం తదితర అంశాలపై తక్షణమే చర్చ చేపట్టాలనీ, ప్రభుత్వం సమాధానం చెప్పాలని విపక్షాలు డిమాండ్ చేస్తూ విపక్ష సభ్యులు ఆందోళన కొనసాగిస్తున్న కారణంగా ఉభయ సభల్లో వాయిదాల పర్వం, సస్పెన్షన్ల పర్వం కొనసాగుతోంది. ధరలపై చర్చకు ప్రభుత్వం సిద్ధమని ప్రకటిస్తున్నా విపక్ష సభ్యులు వెనక్కి తగ్గలేదు. ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తివేయాలంటూ ఆందోళన చేస్తూనే ఉన్నారు.

 

ఈ క్రమంలో ఉభయ సభల నుండి సస్పెండ్ అయిన వారి విపక్ష సభ్యుల సంఖ్య 24కి చేరింది. సస్పెండైన విపక్ష ఎంపీలు పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద బుధవారం 50 గంటల రిలే నిరసన కార్యక్రమాన్ని ప్రారంభించారు. నిరసన కార్యక్రమానికి దిగిన 20 మంది రాజ్యసభ ఎంపీలు, నలుగురు లోక్ సభ ఎంపీలకు ఇతర విపక్ష నేతలు ఆహారం, నీళ్లు అందిస్తున్నారు. రాజ్యసభ సభ్యులపై సస్పెన్షన్ ఎత్తివేయాలని పలు పార్టీలకు చెందిన నేతలు రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడుకు విజ్ఞప్తి చేయగా, సదరు ఎంపీలు విచారం వ్యక్తం చేస్తేనే అది సాధ్యమని స్పష్టం చేయడంతో అందుకు వారు తిరస్కరించారు.

 

నిరసన కార్యక్రమంలో భాగంగా బుధవారం రాత్రి సస్పెండైన ఎంపీలందరూ పార్లమెంట్ ప్రాంగణంలోని గాంధీ విగ్రహం వద్దనే నిద్రించారు. రాత్రి అంతా వారు జాగారం చేసినట్లు తెలిసింది. గురువారం ఉదయం వారు అక్కడే కాలకృత్యాలు తీర్చుకోగా ఇతర నేతలు వారికి టీ, టిఫెన్ లు ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. దీనికి సంబంధించిన వీడియోను కాంగ్రెస్ నేతలు ట్విట్టర్ లో పోస్టు చేశారు.

 

author avatar
sharma somaraju Content Editor

Related posts

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju