NewsOrbit
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

డీఎంకే నేత వివాదాస్పద వ్యాఖ్యలు .. రాజ్ భవన్ సీరియస్ ..డీఎంకే నేతపై పోలీసులకు ఫిర్యాదు

తమిళనాడులో అధికార డీఎంకే పార్టీకి, గవర్నర్ రవికి మధ్య వివాదం తారా స్థాయికి చేరుతోంది. ఇంతకు ముందు నుండే సీఎంఒ, రాజ్ భవన్ మధ్య విభేదాలు కొనసాగుతుండగా, ఇటీవల అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంతో మరో సారి విభేదాలు భగ్గుమన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన అసెంబ్లీ ప్రసంగ పాఠాన్ని గవర్నర్ రవి మార్పు చేసి ప్రసంగించారు. ప్రసంగంలో రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్, తమిళనాడు దివంగత నేతలు పెరియార్, సీఎన్ అన్నాదురై, కరుణానిది వంటి ప్రముఖుల పేర్లను దాటవేస్తూ కొత్త వ్యాఖ్యలను చేర్చారు. ప్రసంగంలో మార్పులను గమనించిన సీఎం స్టాలిన్ దీనిపై అభ్యంతరం వ్యక్తం చేయడంతో గవర్నర్ రవి సభ నుండి వాకౌట్ చేసి వెళ్లిపోయారు.

Tamil Nadu Governor Seeks Action Against DMK Leader For Threatening Comments

 

అనంతరం డీఎంకే నేతలు గోబ్యాక్ రవి అంటూ పోస్టర్ లు వేసి నిరసనలు వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా కూడా గవర్నర్ చర్యను నిరసిస్తూ పోస్టులు పెట్టారు. గవర్నర్ రవి ప్రవర్తనపై తమిళనాడు సహా దేశ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ తరుణంలో గవర్నర్ రవిపై డీఎంకే కార్యకర్త వాజీ కృష్ణమూర్తి వివాదాస్పద వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ పేరును గవర్నర్ చెప్పకపోతే ఆయన కశ్మీర్ వెళ్లాలనీ, అక్కడికి ఉగ్రవాదులను పంపుతామని, వారు ఆయన్ను కాల్చి చంపుతారంటూ బెదిరింపు వ్యాఖ్యలు చేశారు.

భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించిన పితామహుడు అంబేద్కర్ పేరును ఈ వ్యక్తి ఉచ్చరించడానికి నిరాకరిస్తే ఆయనను చెప్పుతో కొట్టే హక్కు నాకు ఉందా లేదా అసలు గవర్నర్ రాజ్యంగం పేరుతో ప్రమాణం చేయలేదా, దాన్ని రాసింది అంబేద్కర్ కాదా. . రాజ్యాంగం మీదనే ప్రమాణం చేస్తే ప్రసంగంలోని అంబేద్కర్ పేరును ఎందుకు చదవలేదు అంటూ కృష్ణమూర్తి చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనం అయ్యాయి. శివాజీ కృష్ణమూర్తి చేసిన అనుచిత వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర స్థాయిలో మండిపడింది. గవర్నర్ బెదిరింపు వ్యాఖ్యలపై రాజ్ భవన్ అధికారులు పోలీసులకు పిర్యాదు చేశారు. డీఎంకే కు ఉగ్రవాద సంబంధాలు ఉన్నాయని ఆరోపిస్తూ అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. అతనిపై క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని చెన్నై పోలీసులకు గవర్నర్ డిప్యూటి సెక్రటరీ ఫిర్యాదు చేయగా, ఫిర్యాదును సీపీ .. సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ సైబర్ క్రైమ్ విభాగానికి పంపించారు.

మరో సారి సీబీఐ సోదాలు .. ఢిల్లీ డిప్యూటి సీఎం మనీశ్ సిసోడియా ఏమన్నారంటే..?

author avatar
sharma somaraju Content Editor

Related posts

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju