NewsOrbit
జాతీయం బిగ్ స్టోరీ

Modi : హే మోదీ! యువత నుంచి ప్రధానికి కొత్త చిక్కు!

Modi : కొన్ని రోజుల నుంచి ట్విట్టర్లో రోజు ట్రెండ్ అవుతున్న నినాదం ఒక్కటే. హ్యాష్ ట్యాగ్ తో ఉదయం లేచేసరికి ప్రధాని మోదీ మీద ఈ అంశం కచ్చితంగా ట్రెండు కనిపిస్తుంది. “మోదీరోజ్గార్దో”, మోదీజాబ్దో” అనే హ్యాష్‌ట్యాగులతో ట్విటర్ లో ఇప్పుడు కొత్త ట్రెండ్ నడుస్తోంది. మోదీ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వాలంటూ అనేకమంది డిమాండ్ చేస్తున్నారు. మోదీని ఉద్యోగాలు కోరుతూ ట్విట్టర్ లో కొన్ని వేల ట్వీట్స్ రోజు కనిపిస్తున్నాయి. అసలు ట్విట్టర్లో చెబుతున్నట్లుగా యువతకు నిజంగా ఉద్యోగాలు కావాలా?? ఇండియాలో నిరుద్యోగం అంత దారుణంగా పెరిగిపోయిందా?? లేక భారతీయ జనతా పార్టీని ప్రధాని మోడీని ఇబ్బంది పెట్టడానికి అంతర్జాతీయంగా పరువు తీసేందుకు కొందరు కావాలనే ప్రయత్నిస్తున్నారా అన్నది కీలకం అయ్యింది. ఈ ప్రశ్నలు మాట ఎలా ఉన్నా సరే ట్విట్టర్లో ఈ ట్రెండ్ మాత్రం దద్దరిల్లిపోతోంది.

** కంబైండ్ గ్రాడ్యుయేట్ స్థాయి పరీక్షలను స్టాఫ్ సెలక్షన్ కమీషన్ సరిగ్గా నిర్వహించలేదని కొందరు విద్యార్థులు ఆరోపణలు చేయడమే ట్విటర్‌లో ఈ హాష్‌ట్యాగులు ట్రెండ్ అవ్వడానికి ప్రధాన కారణం.
ప్రభుత్వ కార్యాలయాల్లో ద్వితీయ, తృతీయ శ్రేణుల ఉద్యోగాలు పొందేందుకు ప్రతీ సంవత్సరం లక్షలాది విద్యార్థులు ఈ పరీక్షలు రాస్తారు. మధ్య ప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన 26 ఏళ్ల రంజీత్ రఘునాథ్ గత ఏడాది అగ్రికల్చర్‌లో పీజీ పూర్తి చేసుకుని, వ్యవసాయ విభాగంలో ఉద్యోగం సంపాదించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి యువత అంతా సాంకేతికతను వినియోగించుకుని తమ వాయిస్ను ప్రభుత్వానికి తెలియజెప్పాలే హ్యాష్ ట్యాగ్ ఉపయోగించి ట్విట్టర్లో ఈ ట్రేండింగ్ చేస్తున్నారని ప్రభుత్వం భావిస్తోంది. రంజిత్ ఇలాంటి వాళ్లు కొన్ని లక్షల లో కరోనా తర్వాత చాలా మందికి ఉద్యోగాలు పోవడంతో ఇప్పుడు దేశంలో నిరుద్యోగిత యువతను పెరిగింది అనటంలో సందేహం లేదు.

** తగినన్ని ఉద్యోగావకాశాలు కల్పించరు. ఒకవేళ కల్పించినా, పరీక్షలు సరిగ్గా నిర్బహించరు. పోనీ అది సవ్యంగా జరిగినా, ఫలితాల్లో గందరగోళం జరుగుతుంది. ఎన్నో ఉద్యోగాలు రాసిన చివరి నిమిషంలో ఫలితాలు మాత్రం వేర్వేరు వారి పేర్లు వస్తున్నాయని, రాజకీయ ప్రాబల్యం ఉద్యోగాల్లో బాగా పెరిగిపోయింది అన్నది కూడా ట్విట్టర్ ట్రెండింగ్లో యువత ఆరోపిస్తున్న మాట.

** హక్కుల కోసం పోరాడుతున్న యువత దీనిపై ఒక చర్చను ప్రారంభించడానికి సోషల్ మీడియాను వేదికగా చేసుకుంటోంది. దీని గురించి మేము ఏదో ఒకటి చెయ్యాలి మొదట దీనిపై అందరిలో అవగాహణ ఏర్పడాలి అని యువత భావిస్తున్నారు.


** సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) తాజా గణాంకాల ప్రకారం.. 2021 జనవరిలో దేశంలోని నిరుద్యోగుల సంఖ్య నాలుగు కోట్లు. ఇందులో రెండు రకాల నిరుద్యోగులు ఉన్నారు. ఉద్యోగం లేక వెతుక్కుంటున్నవాళ్లు, ఉద్యోగం వెతుక్కోకుండా ఉన్నవాళ్లు. అయితే, 2020 డిసెంబర్‌లో నిరుద్యోగ రేటు 9.1 శాతం నుంచీ 2021 జనవరిలో 6.5 శాతానికి తగ్గింది. 2019-20 ఆర్థిక సంవత్సరం చివరికొచ్చేసరికి ఇండియాలో సుమారు 40 కోట్ల ఉద్యోగులు, 3.5 కోట్ల నిరుద్యోగులు ఉన్నారని సీఎంఐఈ గణాంకాలు చెబుతున్నాయి. దీనికి ప్రతీ ఏడాది సుమారు రెండు కోట్ల శ్రామిక జనాభా (వర్కింగ్-ఏజ్ పాపులేషన్) అంటే 15 నుంచీ 59 ఏళ్ల లోపువారు అదనంగా కలుస్తూ ఉంటారు.

** డీమానిటైజేషన్ వలనే మన దేశంలో నిరుద్యోగ సమస్య తీవ్రమైందని మాజీ చీఫ్ స్టాటిస్టిషియన్ ప్రణబ్ సేన్ లాంటి వారు చెబుతున్నారు. డీమానిటైజేషన్ అసంఘటిత రంగాన్ని అతలాకుతలం చేసింది. దాని నుంచి కోలుకుంటూ ఉండగానే కరోనావైరస్ దాడి మొదలైంది. సమస్య మరింత జటిలం అయిపోయింది అనేది విశ్లేషకుల మాట.

** గ్రామీణ ప్రాంతాలకన్నా పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగ సమస్య అధికంగా ఉందని సీఎంఐఈ గణాంకాలు సూచిస్తున్నాయి.
2021 జనవరిలో పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగ సమస్య స్థాయి 8 శాతం దగ్గర ఉండగా, గ్రామీణ ప్రాంతల్లో 5.8 శాతం ఉంది. ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం పట్టణ ప్రాంతాల్లో కూడా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎ) పథకంలాంటిది తీసుకురావాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎ పథకం కింద ప్రభుత్వం గ్రామీణ ప్రాంతల్లో ఒక ఆర్థిక సంవత్సరంలో ప్రతీ ఇంటికీ 100 రోజుల వేతన ఉపాధిని కల్పిస్తుంది. ఈ పథకం కింద ఉపాధికి దరఖాస్తు పెట్టుకున్నవారికి 15 రోజులలోపు ఉద్యోగం రాకపోతే, ప్రభుత్వం వారికి నిరుద్యోగ భృతిని అందజేస్తుంది.”పట్టణ ప్రాంతాల్లో కూడా ఇలాంటి ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశ పెట్టడం గురించి చర్చలు జరుగుతున్నాయి. దీన్ని ఎలా అమలు చేస్తారనేది భవిషత్తులో తెలుస్తుంది.

** ప్రస్తుతం నిరుద్యోగ సమస్య గురించి ట్విటర్‌లో ఆరంభమైన చర్చలు ఎటు దారి తీస్తాయన్నది వేచి చూడాల్సిందే. మోడీ ప్రభుత్వం మీద యువతలో వస్తున్న ఆలోచన మార్పు గురించి బీజేపీ ప్రభుత్వం ఆలోచించాలి. దీంతోపాటు ధరల పెరుగుదల చమురు ధరలు, గ్యాస్ ధరల పెరుగుదల వంటి బీజేపీ ప్రభుత్వానికి ప్రతికూల అంశాలు. ఇప్పుడు యువతలో సైతం నిరుద్యోగం మీద వస్తున్న ఆలోచన మార్పు ప్రభుత్వానికి చెడు సంకేతాలు ఇస్తున్నాయి.

author avatar
Comrade CHE

Related posts

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Lok Sabha Elections 2024: బీజేపీ జాక్ పాట్ .. ఎన్నికలకు ముందే ఆ లోక్ సభ స్థానం ఏకగ్రీవం

sharma somaraju

Teachers Recruitment Scam: బెంగాల్ హైకోర్టు సంచలన తీర్పు .. 25వేల మంది ఉపాధ్యాయులకు బిగ్ షాక్ .. సీఎం మమతా బెనర్జీ ఏమన్నారంటే ..?

sharma somaraju

Lok Sabha Elections 2024: భారీ భద్రత నడుమ మణిపూర్ లో కొనసాగుతున్న రీపోలింగ్

sharma somaraju

Doordarshan: డీడీ న్యూస్ లోగో రంగు మార్పుపై రేగుతున్న దుమారం

sharma somaraju

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

Lok sabha Elections 2024: నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల .. ఏపీ, తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం

sharma somaraju

Ayodhya: అయోధ్య రామాలయంలో అద్భుత దృశ్యం .. సూర్య తిలకాన్ని దర్శించి తరించిన భక్తులు

sharma somaraju

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు సుప్రీం కోర్టులో దక్కని ఊరట

sharma somaraju

Lok Sabha Elections: అస్సాంలోని ఈ పెద్ద కుటుంబంలో 350 మంది ఓటర్లు ..ఆ కుటుంబ ఓట్ల కోసం అభ్యర్ధుల ప్రయత్నాలు

sharma somaraju

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Lok sabha Elections 2024: ప్రధాని మోడీ విమర్శలపై ఘాటుగా స్పందించిన మల్లికార్జున ఖర్గే .. రిప్లై ఇలా..

sharma somaraju