Road Accident: గుజరాత్ లోని అహ్మదాబాద్ జిల్లాలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాజ్ కోట్ – అహ్మదాబాద్ జాతీయ రహరదారిపై బగోదర గ్రామ సమీపంలో ఆగి ఉన్న ట్రక్కును ప్రయాణీకులతో వెళుతున్న ఓ మినీ వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మినీ ట్రక్ ముందు భాగం నుజ్జునుజ్జు కాగా పది మంది అక్కడికక్కడే మృతి చెందారు.
Advertisements
మృతుల్లో అయిదుగురు మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. సురేంద్ర నగర్ జిల్లా చోటిలాకు చెందిన కొందరు మినీ ట్రక్ లో దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది. ప్రమాదంలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Advertisements
Advertisements