MP: గర్భం దాల్చిన అధికార పార్టీ ఎంపీ.. త‌న‌కేం సంబంధం లేదంటున్న భ‌ర్త‌

Share

MP: ఓ అధికార పార్టీ ఎంపీ గ‌ర్భం దాల్చారు. అయితే, ఆమె భ‌ర్త మాత్రం త‌న‌కు ఈ విష‌యంలో ఎలాంటి సంబంధం లేదంటున్నారు. ఈ చిత్ర‌మైన ఎపిసోడ్ బెంగాల్‌లో జ‌రిగింది. రాజకీయాలతో వార్తల్లోకి ఎక్కే బెంగాలీ నటి, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నుస్రత్ జహాన్ ఈసారి తన పర్సనల్ వార్తలతో మీడియాలో నిలిచారు. నుస్రత్ గర్భవతి అని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతుండ‌గా… ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డకు, తనకు ఎటువంటి సంబంధంలేదని భ‌ర్త‌ నిఖిల్ జైన్ జాతీయ‌ మీడియాతో చెప్పినట్లు వార్తలు వ‌స్తుండ‌టం హాట్ టాపిక్ అయింది.

Read More: Corona: కరోనాతో పిల్లలకు ప్రమాదం లేదు – ఎవరు ప్ర‌క‌టించారో తెలుసా?

అలా పాపుల‌ర్ అయింది…

నిఖిల్ జైన్ అనే వ్యాపారవేత్తను బెంగాలీ న‌టీ నుస్ర‌త్ జ‌హాన్ జూన్ 19,2019న టర్కీలో ఆర్భాటంగా వివాహం చేసుకున్నారు. అనంత‌రం ఆమె రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. బెంగాల్లో టీఎంసీ తరపున ఎంపీగా పోటీచేసి గెలుపొందారు. దాంతో అటు పెళ్లి, ఆ వెంటనే రాజకీయ అరంగేట్రం అన్నీ ఆమెకు కలిసి వస్తున్నాయన టాక్ వ‌చ్చింది. ఎంపీగా గెలుపొందిన వెంటనే నుస్రత్ కలకత్తాలో అంగరంగ వైభవంగా రిసెప్షన్ ఏర్పాటు చేయ‌గా ఈ రిసెప్షన్‌కు సీఎం మమతా బెనర్జీ కూడా హాజరయ్యారు. అయితే, ఆ త‌ర్వాతే ప‌రిణామాలు మారిపోయాయి.

Read More: Corona: వాట్సాప్ తో క‌రోనా టెస్ట్ … ఎంత ఈజీగా చేసుకోవ‌చ్చంటే…

బంధం నిల‌బ‌డ‌లేదు..

అయితే నుస్రత్ జ‌హాన్‌, నిఖిల్ జైన్‌ల మధ్య బంధం ఎక్కువకాలం నిలబడలేకపోయిందని స‌మాచారం. తన అకౌంట్ల నుంచి డబ్బులను అనుమతి లేకుండా జైన్ వాడుకున్నాడని నుస్రత్ ఆరోపించింది. అంతేకాకుండా.. తనను కూడా అవసరానికి మాత్రమే వాడుకున్నాడని ఆమె వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. ఇలా ర‌క‌రకాల విబేధాల‌తో వారిద్దరూ గత కొన్ని నెలలుగా దూరంగా ఉంటున్నట్లు స‌మాచారం. అయితే, ఆమె ప్ర‌స్తుతం గ‌ర్భ‌వ‌తి అని స‌మాచారం. కాగా, త‌న‌కు ఈ విష‌యంలో సంబంధం లేద‌ని జైన్ చెప్తున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ ప‌రిణామాల‌న్నీ పెను దుమారంగా మారాయి.


Share

Related posts

10మందిని పెళ్లి చేసుకుంది.. దానికి కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

Teja

Municipal Elections : ఏపిలో ప్రశాంతంలో కొనసాగుతున్న పురపాలక పోలింగ్

somaraju sharma

Manjima Mohan Looking Gorgeous

Gallery Desk