NewsOrbit
జాతీయం న్యూస్

Fauci: భారత్ కు అమెరికా అంటువ్యాధుల నివారణ నిపుణుడు డాక్టర్ పౌచీ కీలక సూచనలు..!!

Fauci: భారత్ లో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న వేళ ఆమెరికా అంటు వ్యాధుల నివారణ నిపుణుడు డాక్టర్ ఆంటోనీ పౌచీ పలు కీలక సూచనలు చేశారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం.. సీరం ఇన్‌స్టిట్యూట్ తయారు చేసిన కోవిషీల్డ్ టీకా రెండు డోసుల మధ్య వ్యవధిని 12-16 వారాలకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నిర్ణయాన్ని డాక్టర్ పౌచీ సమర్థించారు. వ్యాక్సిన్ కొరత ఉన్నప్పుడు ఎక్కువ మందికి తొలి డోసు ఇవ్వడానికి ఇది సరైన నిర్ణయం అని ఆయన పేర్కొన్నారు. వ్యాక్సినేషన్ విజయవంతం చేయడం ద్వారానే మహమ్మారిని నియంత్రణ సాధ్యమని అన్నారు. అవసరమైన మేర వ్యాక్సిన్ లను సమకూర్చుకునేందుకు ఇతర దేశాలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.

top US infectious disease expert Dr Anthony Fauci key suggestions to India
top US infectious disease expert Dr Anthony Fauci key suggestions to India

దాదాపు 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో ఇప్పటి వరకూ తక్కువ శాతం మందికి మాత్రమే టీకా రెండు డోసులు అందాయన్నారు.  అలాగే సుమారు పది శాతం మందికి సింగిల్ డోస్ అంది ఉంటుందని పేర్కొన్నారు. వీలైనంత త్వరగా వ్యాక్సిన్లను సమకూర్చుకునే మార్గాలను అన్వేషించడంతో పాటు వ్యాక్సినేషన్ వేగవంతం చేసి ఎక్కువ మందికి టీకాలు అందజేయాలన్నారు. భారత్ అతి  పెద్ద టీకా తయారీ సామర్థ్యం ఉన్న దేశమని పౌచీ గుర్తు చేస్తూ ఇతర దేశాలు, కంపెనీల తో సమన్వయం చేసుకుని భారీ ఎత్తున టీకా లను సమకూర్చుకోవాలని సూచించారు.

కోవిడ్‌పై చేస్తున్న పోరులో అవసరమైతే మిలటరీ సేవలను కూడా ఉపయోగించుకోవాలని డాక్టర్ పౌచీ సూచించారు. భారత్ ప్రస్తుత సంక్షోభం నుండి బయటపడేందుకు తక్షణం సైన్యం సహాయంతో క్షేత్ర స్థాయిలో ఆసుపత్రులను నిర్మించుకోవాలని చెప్పారు. ఆసుపత్రుల్లో పడకల కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో సైన్యం సహకారంతో తాత్కాలిక వైద్య కేంద్రాలను అందుబాటు లోకి తీసుకురావడం మంచిదని డాక్టర్ పౌచీ అభిప్రాయపడ్డారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!