Twist In Wedding: ఇటీవల కాలంలో పలు వివాహ వేడుకల్లో చివరి క్షణంలో ట్విస్ట్ లు చోటుచేసుకోవడం చూస్తునే ఉన్నాం. కొద్ది సేపటిలో పెళ్లి అనగా వధువు జంప్ అవ్వడం, వివాహ వేదికపై తాళి కట్టే వేళ తన చెల్లినీ వివాహం చేసుకుంటేనే తాను పెళ్లి చేసుకుంటాననీ వథువు డిమాండ్ చేయడం లాంటి ఘటనలు వెలుగుచూశాయి. సాధారణంగా వివాహానికి ముందు పెళ్లి చూపులు జరుగుతాయి. అమ్మాయికి, అబ్బాయి, అబ్బాయికి అమ్మాయి నచ్చితేనే వివాహాం నిశ్చయం చేసుకుంటారు.
ఇక్కడ జరిగింది ఏమిటంటే పెళ్లి చూపులు అయ్యాయి. వధువుకు వరుడు, వరుడుకి వధువు నచ్చారు. పెళ్లి పీటల వరకూ వచ్చింది. పెళ్లి పీటలపై ఆ వధువు బుద్దిగా కూర్చుంది. హోమ గుండం చుట్టూ ఏడు అడుగులు వేశారు. మాంగల్య ధారణ తంతు మరి క్షణాల్లో జరుగనుండగా పెళ్లి పీటల పై నుండి వధువు లేచి వెళ్లిపోయింది. అటు వథువు తల్లిదండ్రులు, ఇరు వరుడి తల్లిదండ్రులు ఆమె వద్దకు వెళ్లి పెళ్లి పీటల మీద నుండి ఎందుకు లేచి వెళ్లావని అడిగితే ఆమె చెప్పిన సమాధానంకు వారు ఒక్కసారిగా షాక్ అయ్యారు. పెళ్లి కొడుకు నచ్చలేదు. ఈ పెళ్లి చేసుకోను అని తెగేసి చెప్పింది.
దీంతో వారు ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. ఆమెను ఎంత బలవంతం చేసినా పెళ్లికి ససేమిరా అన్నది. పెళ్లి మధ్యలో ఆగిపోవడంతో వరుడు ధర్నాకు దిగాడు. పెళ్లి కోసం పెట్టిన ఖర్చులను తిరిగి ఇవ్వాలని వరుడు తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. దీనిపై వధువు తండ్రి తన కుమార్తె పెళ్లికి అంగీకరించడం లేదనీ, ఇప్పటికిప్పుడు అంత డబ్బును ఇవ్వలేనని అంటూ జరిగిన దానికి క్షమాపణలు వేడుకోవడంతో వరుడితో సహా అతని తల్లిదండ్రులు, వారి బంధువులు అక్కడి నుండి వెళ్లిపోయారు. ఈ ఘటన ఇటీవల జార్ఖండ్ లోని రాంచీలో జరిగింది.