జాతీయం న్యూస్

Twitter: బెట్టువీడిన ట్విట్టర్..! ఎట్టకేలకు గ్రీవెన్స్ అధికారి నియామకం..!!

Share

Twitter: కేంద్ర ప్రభుత్వ ఆగ్రహం, పోలీస్ స్టేషన్ లో కేసుల నమోదు, ఢిల్లీ హైకోర్టు మొట్టికాయల నేఫథ్యంలో ట్విట్టర్ తన పట్టును వీడి ఐటీ నిబంధనల అమలునకు దిగి వచ్చింది. నూతన ఐటి నిబంధనల అమలునకు అంగీకరిస్తూ తగు చర్యలు చేపట్టింది. ఫిర్యాదుల అధికారిని నియమించడంతో పాటు తాజాగా నెలవారీ పారదర్శక నివేదికను కూడా విడుదల చేసింది.  భారత ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన ఐటీ నిబంధనల నేపథ్యంలో కేంద్రానికి, ట్విట్టర్ కు మధ్య వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ట్విట్టర్ నూతన ఐటీ నిబంధనలను పాటించకపోవడంతో ఢిల్లీ హైకోర్టులో కేంద్రం పిటిషన్ దాఖలు చేసింది. కేంద్ర ప్రభుత్వ నిబంధనలను ట్విట్టర్ పాటించకపోవడం పై ఢిల్లీ హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. నూతన ఐటీ నిబంధనలను ట్విట్టర్ దిక్కరించాలనుకుంటుందా అని ఇటీవల హైకోర్టు ప్రశ్నించింది. హైకోర్టు మొట్టికాయలు వేసిన నేపథ్యంలో ఐటీ నిబంధనల ప్రకారం ఫిర్యాదుల స్వీకరణకు గ్రీవెన్స్ అధికారిని నియమించేందుకు తమకు ఎనిమిది వారాల గడువు కావాలని కోర్టుకు ట్విట్టర్ కోరింది.

Twitter appointed rgo
Twitter appointed rgo

Read More: YS Sharmila Party: షర్మిల పార్టీపై హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు !వైఎస్సార్ వారసులకు తెలంగాణలో స్థానమే లేదని తేల్చేసిన మంత్రి!!

అయితే ఎనిమిది వారాలు గడువుకోరిన ట్విట్టర్ మూడు రోజుల్లోనే రిసిడెంట్ గ్రీవెన్స్ అధికారి (ఆర్జీఓ)ని నియమించింది. భారత్ కు చెందిన వినయ్ ప్రకాశ్ ను గ్రీవెన్స్ అధికారిగా నియమించింది. ఈ మేరకు ట్విట్టర్ తన వెబ్ సైట్ లో ఆర్జీఓ వివరాలను ఉంచింది. ఆర్జీఓ ఈ మెయిల్ ఐడీకి వినియోగదారులు తమ ఫిర్యాదులను పంపించవచ్చని తెలిపింది. దేశంలో నూతన కొత్త ఐటీ నిబంధనలు అమల్లోకి వచ్చి దాదాపు నెలన్నర తరవాత ట్విట్టర్ చర్యలకు ఉపక్రమించడం గమనార్హం. ఈ క్రమంలోనే కోర్టు మొట్టికాయలు వేయడంతో పాటు వివిధ రాష్ట్రాల్లో కేసులు ఎదుర్కోవాల్సి వచ్చింది. తమ వేదికపై నిబంధనలకు విరుద్దంగ ఉన్ కంటైంట్ల పై చర్యలు తీసుకున్నట్లు పారదర్శక నివేదికలో ట్విట్టర్ వెల్లడించింది. వీటిలో చాలా కంటెంట్లను తొలగించగా, కొన్నింటిని ఫ్లాగ్ చేసినట్లు పేర్కొంది.

కొత్త ఐటీ నిబంధనలను అనుసరించి ఫేస్ బుక్, గూగుల్, ఇన్ స్టాగ్రామ్ సహా పలు సోషల్ మీడియా సంస్థలు ఇప్పటికే నెలవారీ పారదర్శక నివేదికలను విడుద చేశాయి. వివిధ సామాజిక మాధ్యమాల్లో డిజిటల్ కంటెంట్ పై నియంత్రణ కోసం కేంద్ర ప్రభుత్వ గత ఫిబ్రవరి నెలలో కొత్త నియమ నిబంధనలను ప్రకటించిన సంగతి తెలిసిందే. అవన్నీ తక్షణమే అమల్లోకి వచ్చాయి. అయితే 50 లక్షలకుపైగా రిజిస్టర్డ్ వినియోగదారులు ఉన్న ట్విట్టర్, వాట్సాప్, ఫేస్ బుక్, గూగుల్ వంటి సంస్థలు మాత్రం వీటి అమలునకు వీలుగా మూడు నెలల సమయం ఇచ్చింది. ఆ గడువు ముగియడంతో మే 26 నుండి నూతన నిబంధనలు అమల్లోకి వచ్చాయి. అయితే ఈ నిబంధనలు పాటించేందుకు ఫేస్ బుక్, గూగుల్ సముఖత వ్యక్తం చేయగా ట్విట్టర్ మాత్రం కొత్త నిబందనల అమలు చేయడంలో ఆలస్యం చేసింది.


Share

Related posts

కార్మికుడి పంట పండింది.. త‌వ్వ‌కాల్లో 3 వ‌జ్రాలు దొరికాయి.. ల‌క్షాధికారి అయ్యాడు..!

Srikanth A

మూడు … ముప్పు తిప్పలు … జగన్నాటమ్ లా రాజధానుల వ్యవహారం

Special Bureau

 పండుగలు వస్తున్నాయి కదా..! కారు, ఇళ్ల లోన్ల పై ప్రత్యేక ఆఫర్లు చూడండి…

S PATTABHI RAMBABU