25.7 C
Hyderabad
March 28, 2023
NewsOrbit
జాతీయం న్యూస్

నిరుద్యోగులకు నిర్మలమ్మ తీపి కబురు ..38,800 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి చర్యలు

Share

నిరుద్యోగులకు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ గుడ్ న్యూస్ చెప్పారు. 2023 – 24 బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ తన ప్రసంగంలో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో రాబోయే మూడేళ్లలో 38,800 అధ్యాపక, అధ్యాపకేతర ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. 740 పాఠశాలతో 3.5 లక్షల గిరిజన విద్యార్ధులకు వీరి ద్వారా సేవలు అందించనున్నట్లు పేర్కొన్నారు.

Union Budget of india 2023 Nirmala Sitaraman announces Teacher jobs recruitment

 

వైద్యరంగంపై మాట్లాడుతూ.. ప్రస్తుతం ఉన్న 157 మెడికల్ కళాశాలతో కలిపి మరో 157 కొత్త నర్సింగ్ కళాశాలలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పిల్లలు, యుక్త వయస్సుల వారి కోసం జాతీయ డిజిటల్ లైబ్రరీని ఏర్పాటు చేయనున్నట్లు సీతారామన్ పేర్కొన్నారు. భాషలు, కళలు, భౌగోళిక అంశాలకు సంబంధించి నాణ్యమైన పుస్తకాల లభ్యతను సులభతరం చేయడం కోసం దీనిని ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.

Union Budget of india 2023 Nirmala Sitaraman announces Teacher jobs recruitment

 

Read More: విశాఖ నుండి రాజధాని పాలన ముహూర్తం ఎప్పుడో చెప్పేసిన టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి..! అసలు మ్యాటర్ ఏమిటంటే..?

బడ్జెట్ లో రైల్వేకు రూ.2.40 లక్షల కోట్లు, రాష్ట్రాలకు వడ్డీ లేని రుణాల పథకం కోసం రూ.13,7లక్షల కోట్లు, కర్ణాటక సాగు రంగానికి రూ.5,300 కోట్లు, పీఎం ఆవాస్ యోజనకు రూ.79వేల కోట్లు, కీలకమైన వంద మౌలిక వసతుల ప్రాజెక్టులకు రూ.75వేల కోట్లు, మూల ధన వ్యయాల మొత్తం రూ.10 లక్షల కోట్లు కేటాయించారు. ఏడు ప్రాధాన్య అంశాలుగా ఈ బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగిందని తెలిపారు.

Read More: ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేస్తూ.. బాలినేని మాటలు జగన్ మాటలుగానే భావిస్తున్నానన్న ఎమ్మెల్యే కోటంరెడ్డి


Share

Related posts

Prabhas : ప్రభాస్‌ని బీట్ చేసేసి దూసుకెళ్లిన అల్లు అర్జున్.. అమ్మబాబోయ్ బాహుబలి కూడా పనికిరాదు ఈ రికార్డ్ ముందు!

Ram

Yoga: యోగా గురించి కెలికాడు…ఈ నేపాలీ పెద్దాయ‌న బుద్ధి పోనిచ్చుకోలేదు

sridhar

అప్పుడు నందిగం సురేష్ బాబు …ఇప్పుడు డాక్టర్ గురుమూర్తి!జగన్ రూటే సపరేటు!!

Yandamuri