జాతీయం న్యూస్

Union Home ministry: సెక్షన్ 66ఏ కేసులపై కేంద్ర హోంశాఖ కీలక ఆదేశాలు..!!

Share

Union Home ministry:  కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) యాక్ట్ – 2000 సెక్షన్ 66 ఏ కింద నమోదైన కేసులను ఎత్తివేయాలని నిర్ణయించింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఈ మేరకు హోంశాఖ బుధవారం అదేశాలు జారీ చేసింది. సెక్షన్ 66 ఏ కింద కొత్తగా కేసులు నమోదు చేయవద్దని స్పష్టం చేసింది.

Union Home ministry key decision on section 66a cases
Union Home ministry key decision on section 66a cases

Read More: CBI Court: సీబీఐ కోర్టులో కీలక పరిణామం..! జగన్ బెయిల్ రద్దు పిటిషన్ పై విచారణ వాయిదా..!!

ఐటీ చట్టంలోని సెక్షన్ 66 ఏ రద్దు చేస్తూ 2015 లో సుప్రీం కోర్టు తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. తీర్పు వెల్లడించి ఆరేళ్లు అవుతున్నా ఆ సెక్షన్ కింద దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కేసులు నమోదు అవుతుండటంపై సుప్రీం కోర్టు ఇటీవల ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీం కోర్టు..కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. దీంతో హోంశాఖ తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నది. సుప్రీం తీర్పు తర్వాత దేశ వ్యాప్తంగా 11 రాష్ట్రాల్లో సెక్షన్ 66 ఏ కింద 1307 కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసుల నమోదులో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉండగా, రెండు తెలుగు రాష్ట్రాల్లో 50 కి పైగా కేసులు నమోదు అయ్యాయి.

 


Share

Related posts

Bahubali : రీల్ కాదు.. రియల్ బాహుబలి వీడియో అదుర్స్ ..!!

bharani jella

భ‌లే.. రూ.50 పెడితే.. రూ.4 ల‌క్ష‌లు వ‌స్తాయి.. ఎలాగంటే..?

Srikanth A

మరీ ఇలా డెడ్ లైన్స్ పెడితే ఎలా పవన్?

sowmya