Wrestlers Protest: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గత కొద్ది కాలంగా రెజ్లర్లు ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా నిరసన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వారు విదుల్లో చేరినా ఆందోళన కొనసాగుతుందని వెల్లడించారు. ఈ క్రమంలో మరో సారి రెజ్లర్ల సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందంటూ ఆహ్వానించారు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్. ఈ మేరకు అర్ధరాత్రి ఆయన ట్వీట్ చేశారు.

కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఆహ్వానంపై వారు సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తొంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో శనివారం రాత్రి రెజ్లర్లు సమావేశమైయ్యారు. ఆ తర్వాత కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం స్టార్ రెజ్లర్లు సాక్షి మాలిక్, బజరంగ్ పునియా, వినేశ్ ఫొగాట్ రైల్వేలో విధుల్లో చేరారు. న్యాయం కోసం జరిగే పోరాటంలో వెనక్కి తగ్గలేదని చెప్పారు. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి అనురాగ్ ఠాగూర్ చర్చలకు అహ్వానించారు.
అమిత్ షా భేటీపై బజరంగ్ పునియా స్పందిస్తూ తాము కేంద్ర మంత్రితో ఎలాంటి ఒప్పందం చేసుకోలేదని తెలిపారు. ఈ ఉద్యమం ఆగదని, దీనిపై ఎలా ముందుకు వెళ్లాలనేదానిపై వ్యూహరచన చేస్తున్నామన్నారు. ప్రభుత్వం తమ డిమాండ్ లను అంగీకరించలేదనీ, ప్రభుత్వం స్పందనతో తాము సంతృప్తిగా లేమని వెల్లడించారు. మే 31నే వారు విధుల్లో చేరినట్లుగా రైల్వే అధికారులు ఇంతకు ముందు వెల్లడించారు.
టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్ర ప్రసాద్ కు గుండె పోటు