బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి బెదిరింపు కాల్స్ రావడం మహారాష్ట్ర లో తీవ్ర సంచలనం అయ్యింది. మహారాష్ట్ర లోని నాగ్ పూర్ లో ఆయన కార్యాలయానికి దుండగులు కాల్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారు. పది నిమిషాల వ్యవధిలో రెండు సార్లు ఫోన్ చేసి బెదిరింపులకు పాాల్పడటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. శనివారం ఉదయం 11.30, ఆ తర్వాత 11,40 గంటలకు దుండగుల నుండి ఫోన్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇది ఆకతాయిల పని అయి ఉంటుందా లేక ఎవరైనా సీరియస్ వార్నింగ్ ఇచ్చారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దుండగులు ఉపయోగిచిన సెల్ ఫోన్ నెంబర్ ఆధారంగా పోలీసులు విచారణ జరుపుతున్నారు.
జగన్ సర్కార్ కు ఊహించని వ్యక్తి నుండి ప్రశంసలు .. ఆ అంశాలపై మద్దతు తెలిపిన జేడీ లక్ష్మీనారాయణ