UPSC Final Result 2022: అఖిల భారత సర్వీసుల్లో నియామకాలకు యూపీఎస్సీ నిర్వహించిన సివిల్స్ – 2022 తుది ఫలితాలు విడుదల అయ్యాయి. మొత్తం 933 మందిని యూపీఎస్సీ ఎంపిక చేసింది. ఇందులో జనరల్ కోటాలో 345 మంది, ఈడబ్ల్యుఎస్ నుండి 99 మంది, ఓబీసీ నుండి 263 మంది, ఎస్సీ నుండి 154 మంది, ఎస్టీ నుండి 72 మంది ఉన్నారు. పోస్టుల వారీగా ఐఏఎస్ సర్వీసులకు 180 మంది, ఐఎఫ్ఎస్ కు 38 మంది, ఐపీఎస్ కు 200 మంది ఎంపిక అయ్యారు. ఇక సెంట్రల్ సర్వీసెస్ గ్రూపు – ఎ కేటగిరి లో 473 మంది, గ్రూప్ బీ సర్వీసెస్ లో 131 మంది ఎంపికైయ్యారు. ఈ మేరకు యూపీఎస్సీ ప్రకటన విడుదల చేసింది.

ఈ ఫలితాల్లో తొలి నాలుగు ర్యాంకుల్లో అమ్మాయిలే సత్తా చాటారు. ఇషితా కిషోర్ ప్రధమ ర్యాంక్ సాధించారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు మెరుగైన ర్యాంకులు సాధించారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన జీవిఎస్ పవన్ దత్తా 22వ ర్యాంకు సాధించగా, శాఖమూరి శ్రీసాయి అర్షిత్ 40, ఆవుల సాయి కృష్ణ 94, అనుగు శివమారుతీ రెడ్డి 132, రాళ్లపల్లి వసంత కుమార్ 157, కమతం మహేశ్ కుమార్ 200, రావుల జయసింహారెడ్డి 217, బల్లం ఉమామహేశ్వర్ రెడ్డి 270, చల్లా కల్యాణి 285, పాలువాయి విష్ణువర్ధన్ రెడ్డి 292, గ్రంధె సాయి కృష్ణ 293, వీరగంధం లక్ష్మీ సుజిత 311, ఎన్ చేతనా రెడ్డి 346, శృతి యారగట్టి 362, యప్పలపల్లి సుష్మిత 384, శ్రావణ్ కుమార్ రెడ్డి 426, బొల్లిపల్లి వినూత్న 462 ర్యాంకులతో సత్తా చాటారు.
YS Viveka Case: సుప్రీం కోర్టులో వైఎస్ అవినాష్ రెడ్డికి మరో సారి ఎదురుదెబ్బ.. కానీ.. కీలక ఆదేశాలు