NewsOrbit
జాతీయం టెక్నాలజీ ట్రెండింగ్ న్యూస్

Credit Card Rewards: ఇలా కూడా కోటీశ్వరుడు అవ్వొచ్చా..!? క్రెడిట్ కార్డు రివార్డు పాయింట్లతో..

Credit Card Rewards: సంపాదించాలన్న మనసుంటే ఎన్నో మార్గాలు ఉంటాయి అని నిరూపించాడు అమెరికాకు చెందిన ఓ యువకుడు. కొందరు బెట్టింగ్ ల ద్వారా సంపాదిస్తారు. మరి కొందరు షేర్ మార్కెట్ ద్వారా డబ్బులు సంపాదిస్తారు. కొందరు లాటరీలు ఇలా ఎన్నో ఎన్నెన్నో చేస్తూ డబ్బులు సంపాదిస్తుంటారు. అయితే అమెరికాకు చెందిన ఓ భౌతిక శాస్తవేత్త ఆన్ లైన్ ద్వారా వస్తువుల కొనుగోలు చేస్తూ రివార్డు పాయింట్స్ తో కోట్లకు పడగలెత్తాడు. క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డుల ద్వారా నిర్వహించే కొనుగోళ్లకు రివార్డు పాయింట్ లు వస్తాయనేది అందరికీ తెలిసిందే. ఈ రివార్డు పాయింట్స్ తో అతను కరోడ్‌పతి అయ్యాడు. ఏకంగా 3లక్షల డాలర్లు (దాదాపు రూ.2.17కోట్లు) సంపాదించాడు. అదేలానో ఇప్పుడు చూద్దాం..

US citizen gets crores through Credit Card Rewards points
US citizen gets crores through Credit Card Rewards points

కొనస్టాంటిన్ అనికీవ్ అనే ఆర్థిక శాస్త్రవేత్త క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా సంపాదించే మార్గాన్ని ఎంచుకున్నాడు. 2009 నుండి అతను క్రెడిట్ కార్డులను ఉపయోగించి పెద్ద ఎత్తున గిఫ్ట్ కార్డులు కొనుగోలు చేయడం, ఆ తరువాత వాటిని సొమ్ము చేసుకునే వాడు. ఆ సొమ్మును తన బ్యాంకు ఖాతాలో డిపాజిట్ చేసి క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించే వాడు. రివార్డు పాయింట్ల ద్వారా వచ్చే సొమ్ము అతనికి మిగిలిపోయేది.

Read More: Vaccine: వాక్సిన్ లపై విస్తుగొలిపే నిజాలు బయటకు..!?

సాధారణంగా 500 డాలర్ల గిఫ్ట్ కార్డు కొంటే 5 శాతం చొప్పున 25 డాలర్లు వచ్చేవి. గిఫ్ట్ కార్డు ను సొమ్ము చేసుకోవాలంటే 6 డాలర్లు చెల్లించాలి. మిగిలిన 19 డాలర్లు లాభంగా మిగులుతుంది. ఇలా అతను కోటేశ్వరుడు కావడంతో కొందరు ఆతని ఆదాయంపై అమెరికా పన్నుల శాఖకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన ఆదాయపన్ను శాఖ అధికారులు అతని సంపాదన నిజమేనని తేలడంతో అక్రమాస్తుల కింద నోటీసు ఇచ్చారు.

 

ఈ కేసు కోర్టుకు చేరడంతో అనికీవ్ తాను అక్రమ మార్గంలో సంపాదించలేదని సమర్థించుకున్నాడు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు అతనికి షాకింగ్ విషయాన్ని వెల్లడించింది. గిఫ్ట్ కార్డులు ఆస్తుల వంటివేనని తెలిపింది. వచ్చిన క్రెటిట్ కార్డు రివార్డులకు పన్నులు ఉండవని చెబుతూనే గిఫ్ట్ కార్డులను నగదుగా మార్చుకోవడం అంటే ఆస్తిని తిరిగి విక్రయించడమేనని చెప్పింది. దీనికి వచ్చిన ఆదాయంపై పన్ను చెల్లించాల్సిందేనని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

 

author avatar
Srinivas Manem

Related posts

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!