NewsOrbit
జాతీయం బిగ్ స్టోరీ

Kerala మలబారు మంత్రం.. కాషాయ తంత్రం!!

Kerala : అత్యంత అందమైన రాష్ట్రంగా , దేవతలు తిరిగే భూమి గా పిలుచుకునే కేరళలో ఇప్పుడు రాజకీయ రణతంత్రం ఆసక్తిగా మారుతోంది. ఆపరేషన్ దక్షిణ కమలంలో భాగంగా క్రమంగా దక్షిణ భారతదేశ రాజకీయాల మీద పట్టు పెంచుకోవాలని భావిస్తున్న బీజేపీ దీనికోసం తీవ్రంగా కసరత్తు చేస్తోంది. ఈ ఏడాదే కేరళ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో క్రమక్రమంగా అక్కడి రాజకీయాలు వేడి పుంజుకుంటున్నాయి. శాసనసభ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఈ కీలక రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. తాజాగా కమ్యూనిస్టులకు కంచుకోట కేరళ పై భారతీయ జనతా పార్టీ గుర్తు పెట్టినట్లు తెలుస్తోంది. కేరళలో కచ్చితంగా ఈ సారి పాగా వేసేందుకు అవసరమైన సమీకరణాలు వేస్తోంది.

పరుగుల రాణి వస్తారా?

కేరళలో అక్షరాస్యత శాతం ఎక్కువ. రాజకీయ చైతన్యం కూడా అధికం. ఇక్కడ గెలుపు సాధారణ విషయం కాదు. ఎంతో విజ్ఞతతో, అలోచించి ఓటేసేవారు కనిపిస్తారు. అందుకే బీజేపీ ఇప్పుడు కొత్త ఫార్ములా ను కేరళలో అనుసరిస్తోంది. వివిధ రంగాల్లో ప్రముఖులైన వారు మేధావివర్గం గా ఉన్నవారు నిజాయితీ పరులుగా దేశానికి సేవ చేసిన వారుగా ఉన్న కొందరిని పార్టీలోకి ఆహ్వానిస్తోంది. ఖచ్చితంగా వారిని పార్టీలోకి తీసుకొచ్చి ఒక కొత్త రూపం ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ భావిస్తోంది. ఇప్పటికే మెట్రోమాన్ శ్రీధర్ న్ ను పార్టీలోకి తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు చేసిన బిజెపి త్వరలో పరుగుల రాణి పి.టి.ఉష ను సైతం బీజేపీ లోకి తీసుకురావడానికి ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. పి.టి.ఉష సైతం బిజెపి ఆహ్వానాన్ని మన్నించి రాజకీయాల్లోకి అడుగు పెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తాజాగా వార్తలు వస్తున్నాయి. అయితే వీటిని పి.టి.ఉష గాని ఆమె కుటుంబ సభ్యులు గానీ ధ్రువీకరించడం లేదు.

అందరికీ ఆమోదయోగ్యం అయిన వారిని..

పరుగుల రాణి పి.టి.ఉష గత కొంతకాలంగా బిజెపి కు సానుకూలంగా మాట్లాడుతున్నారు. కేంద్రం తీసుకువచ్చిన సాగు చట్టాల పైన కూడా బీజేపీకి ఆమె మద్దతు ప్రకటించారు. అంతేకాకుండా ఇటీవల కొందరు అంతర్జాతీయ సెలబ్రిటీలు రైతు చట్టాల పై చేసిన వ్యాఖ్యలను సైతం పి.టి.ఉష ఖండించారు. రైతు చట్టాలు మంచిదే అన్న రీతిలో ట్విట్టర్లో కూడా స్పందించారు. దీంతో ఆమె త్వరలోనే బీజేపీలో చేరనున్నట్లు కేరళ మొత్తం మీద గట్టిగా వార్తలు వచ్చాయి. బిజెపి జాతీయ నాయకులు కేరళలో పర్యటించినప్పుడు ఆమె బిజెపి తీర్థం పుచ్చుకునే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.

దేవభూమి ఎప్పుడూ ప్రత్యేకమే

దక్షిణాదిన దేవభూమిగా పిలుచుకునే కేరళలో వామపక్ష పార్టీ Kerala మలబారు మంత్రం.. కాషాయ తంత్రం!! అధికారంలో ఉంది. కేరళలో ఎప్పటినుంచో వామపక్షాలకు మంచి పట్టు ఉంది. ఇప్పుడు ఈ రాష్ట్రం మీద బిజెపి దృష్టిపెట్టినట్లు అర్థమవుతోంది. ఇక్కడ కచ్చితంగా పాగా వేసేందుకు సైతం బిజెపి తహతహలాడుతోంది. గతంలో శబరిమల లో మహిళల ప్రవేశానికి అనుకూలంగా బిజెపి ఉద్యమాన్ని ఉధృతం చేసిన అనుకున్న ఫలితం కనిపించలేదు. ఆ ఉద్యమం కూడా పక్కదారి పట్టింది. అయితే ఇప్పుడు పార్టీ మైలేజ్ రావాలంటే కచ్చితంగా అందరూ ఆమోదించే వారిని తీసుకుని, వారి ద్వారా రాజకీయాల్లో ముందుకు వెళితే మంచి ఫలితం ఉంటుందని కేరళలో ఖచ్చితంగా కాషాయ జెండా ఎగురవేయాలని బిజెపి భావిస్తోంది.

author avatar
Comrade CHE

Related posts

Lok Sabha Elections 2024: బీజేపీ జాక్ పాట్ .. ఎన్నికలకు ముందే ఆ లోక్ సభ స్థానం ఏకగ్రీవం

sharma somaraju

Teachers Recruitment Scam: బెంగాల్ హైకోర్టు సంచలన తీర్పు .. 25వేల మంది ఉపాధ్యాయులకు బిగ్ షాక్ .. సీఎం మమతా బెనర్జీ ఏమన్నారంటే ..?

sharma somaraju

Lok Sabha Elections 2024: భారీ భద్రత నడుమ మణిపూర్ లో కొనసాగుతున్న రీపోలింగ్

sharma somaraju

Doordarshan: డీడీ న్యూస్ లోగో రంగు మార్పుపై రేగుతున్న దుమారం

sharma somaraju

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

Lok sabha Elections 2024: నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల .. ఏపీ, తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం

sharma somaraju

Ayodhya: అయోధ్య రామాలయంలో అద్భుత దృశ్యం .. సూర్య తిలకాన్ని దర్శించి తరించిన భక్తులు

sharma somaraju

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు సుప్రీం కోర్టులో దక్కని ఊరట

sharma somaraju

Lok Sabha Elections: అస్సాంలోని ఈ పెద్ద కుటుంబంలో 350 మంది ఓటర్లు ..ఆ కుటుంబ ఓట్ల కోసం అభ్యర్ధుల ప్రయత్నాలు

sharma somaraju

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Lok sabha Elections 2024: ప్రధాని మోడీ విమర్శలపై ఘాటుగా స్పందించిన మల్లికార్జున ఖర్గే .. రిప్లై ఇలా..

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్ కేసులో ప్రధాన నిందితుల అరెస్టు ..టోపీ ఆధారంగా నిందితుల పట్టివేత

sharma somaraju

Delhi Liquor Scam: కవితను కోర్టులో హజరుపర్చిన సీబీఐ .. కస్టడీపై ముగిసిన వాదనలు

sharma somaraju