NewsOrbit
Featured జాతీయం బిగ్ స్టోరీ

Karnataka : జార్కి హోలీ కి రంగులు : ఆసక్తి గా కర్ణాటక రాజకీయం!

Karnataka : రాజకీయాల్లో హత్యలు ఆత్మహత్యలు తప్ప అంటారు. ప్రస్తుత కర్ణాటక రాజకీయాల్లో మంత్రి రమేష్ జర్కి హోలీ విషయంలో అదే జరిగింది అనిపిస్తోంది. అనుకోని రీతిలో వివాదంలో చిక్కుకున్న ఈ నేత కర్ణాటక రాజకీయాల్లో ఒకప్పుడు చక్రం తిప్పారు. ఏకంగా ప్రభుత్వాలను మార్చే సత్తా కలిగిన ఆయన ఇప్పుడు మహిళతో అసభ్యంగా ఉన్నారన్న అప్రతిష్టతో తన రాజకీయ జీవితంలో మచ్చ వేసుకున్నారు.

ఎవరో ఒకరు మంత్రి గా

రమేష్ జర్కి హోలీ కుటుంబలో ఆయనతో పాటు ఇద్దరు సోదరులు రాజకీయాల్లో ఉన్నారు. ముగ్గురు వేర్వేరు పార్టీల నుంచి అసెంబ్లీకి ఎన్నిక కావడం వీరి కుటుంబం ప్రత్యేకత. రమేష్ జర్కి హోలీ, బాలచంద్ర జర్కి హోలీ, సతీష్ జర్కి హోలీలు కర్ణాటకలోని బెళగవ్ జిల్లా గోకక్, అరబవి, యామకనమరడి అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ప్రాతినిధ్యం వహించారు. రమేష్ జర్కి హోలీ మొదట కాంగ్రెస్ పార్టీ తోనే తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం రమేష్ సోదరుడు సతీష్ కర్ణాటక కౌన్సిల్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

1999లో రమేష్ జర్కి హోలీ జనతా దళ్ యునైటెడ్ అభ్యర్థి నాయక్ చంద్రశేఖర్ సదాశివ ను 55 వేల ఓట్ల తేడాతో ఓడించి మొదటిసారి కర్ణాటక అసెంబ్లీలో అడుగుపెట్టారు. అప్పట్లో అదే అత్యధిక మెజారిటీ. 2004 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి మల్లప్ప లక్ష్మణ్ మీద 15 వేల ఓట్ల తేడాతో గెలిచారు. ప్రస్తుతం ఆయన బీజేపీ తరఫున గోకక్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న వీరి కుటుంబం నుంచి ఒకరు మంత్రిగా ఉండాల్సిందే. బాలచంద్ర జర్కి హోలీ మొదటినుంచి బీజేపీలోమొదటి నుంచి బీజేపీ లో కొనసాగుతుంటే, మరో సోదరుడు సతీష్ జర్కి హోలీ అన్నతో వచ్చిన విబేదాల వాళ్ళ కాంగ్రెస్ లోనే ఉన్నారు.

షావుకారుగా…!

బెళగవి జిల్లాలో ప్రఖ్యాత వ్యాపారవేత్త లక్ష్మణరావు జర్కి హోలీ కుమారుల్లో ఐదుగురు రాజకీయాల్లోనే వున్నారు. పెద్ద వాడు అయిన రమేష్ జర్కి హోలీ. అక్కడి ప్రజలంతా వీరిని షావుకారు అని పిలిచి కొని, రాజకీయంగా వీరికి అండగా నిలుస్తూ వస్తున్నారు. ఆర్థికంగా మంచి స్థితిలో ఉన్న అన్నదమ్ముల మధ్య 2019 కర్ణాటక ప్రభుత్వ సర్కారు సంక్షోభం సమయంలో కొన్ని భేదాభిప్రాయాలు తలెత్తాయి. దింతో రమేష్ వెంట నడవకుండా సతీష్ కాంగ్రెస్లోనే ఉండి పోయారు. మిగిలిన వారు సైతం అప్పట్లో ఇంటి పెద్ద రమేష్ తీరు మీద అసహనం వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి.

Karnataka
Karnataka

ఆయనపైనే చర్చ!

2018 లో కర్ణాటకలో కాంగ్రెస్ – జేడీఎస్ ప్రభుత్వం కూలిపోవడం లో రమేష్ జర్కి హోలీ పేరు ప్రముఖంగా వినిపించింది. రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు తనను ప్రాధాన్యాన్ని కావాలనే తగ్గిస్తున్నారన్న కోపం అప్పట్లో రమేష్ జర్కి హోలీ పార్టీ ఫిరయింపు కు కారణం అయ్యింది. అప్పటి కర్ణాటక శాసన సభ స్పీకర్ డీకే శివకుమార్ బెలగావి రాజకీయాల్లో విపరీతమైన జోక్యంతో విసుగు చెందిన రమేష్ జర్కి హోలీ అవకాశం కోసం వేచి చూశారు. మరో వైపు బెళగవి జిల్లా నుంచి కీలక నేతగా ఉన్న తనకు కాంగ్రెస్ మంత్రి వర్గంలో స్థానం కల్పించకపోవడం కూడా రమేష్ కు తీవ్ర అవమానాన్ని మిగిల్చినట్లు అయ్యింది.

రమేష్ ప్రాబల్యం బెళగవి ప్రాంతంలో తగ్గించేందుకు ఆయన రాజకీయ శత్రువుగా ఉన్న లక్ష్మి హెబ్బాల్కర్ ను డీకే శివకుమార్ ప్రోత్సహించి బళ్లారి నుంచి ఎమ్మెల్యేగా గెలిపించడమే కాకుండా, కర్ణాటక పిసిసి మహిళా విభాగానికి అధ్యక్షురాలు చేయడంతో రమేష్ జర్కి హోలీ బెలగావి లోని మిగిలిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తీసుకొని బయటకు వచ్చారు. దీంతో వారి మీద అనర్హత వేటు పడటం తర్వాత బీజేపీలో చేరడం జరిగిపోయింది. తర్వాత ఉప ఎన్నికల్లో 30 వేల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి మీద రమేష్ జర్కి హోలీ గెలిచి బిజెపి ప్రభుత్వంలో సాగు నీటి శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు.

మళ్ళీ ముందుకు రాగలరా?

ఉత్తర కర్ణాటక రాజకీయాల్లో బెళగావి జిల్లా కీలకం. కాంగ్రెస్ కు పట్టు ఎక్కువ. ఇక్కడి నుంచే ఎక్కువ మంది ముఖ్యమంత్రులు, మంత్రులు అయ్యారు. మహారాష్ట్ర సరిహద్దు ఆనుకుని ఉండే ఈ జిల్లా లో 13 నియోజక వర్గాలు ఉన్నాయి. మారాఠ లు ఎక్కువగానే ఉండే ఈ జిల్లాలో మహారాష్ట్ర రాజకీయ ప్రభావం కనిపిస్తుంది. హుక్కేరి, కత్తి, పటాన్స్, కౌగిలిగస్, వాల్మీకి నాయక్ ఎక్కువగా ఉండే ఈ జిల్లాలో జర్కి హోలీ కుటుంబానికి వీరంతా అండగా ఉంటున్నారు.

వాల్మీక నాయక్ సామాజిక వర్గానికి చెందిన జర్కి హోలీ కుటుంబం దశాబ్దాలుగా ఆ ప్రాబల్యాన్ని అలాగే పెంచుకుంటూ వస్తోంది. ఈ కుటుంబం పట్టు ఎక్కడ కోల్పోకుండా జిల్లాలో రాజకీయాలు చేయడంతో పాటు కాంగ్రెస్ కు రమేష్ వెన్నుముక గా నిలిచేవారు. రాజకీయాల్లో ఎప్పుడు కీలకంగా ఉండే ఈ కుటుంబం ఇప్పుడు అనుకోని వివాదంలో చిక్కుకోవడంతో కర్ణాటక రాజకీయాల్లో ముఖ్యంగా బెల్గావ్ జిల్లా రాజకీయాల్లో పెద్ద కుదుపు గా భావించవచ్చు.

author avatar
Comrade CHE

Related posts

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Lok Sabha Elections 2024: బీజేపీ జాక్ పాట్ .. ఎన్నికలకు ముందే ఆ లోక్ సభ స్థానం ఏకగ్రీవం

sharma somaraju

Teachers Recruitment Scam: బెంగాల్ హైకోర్టు సంచలన తీర్పు .. 25వేల మంది ఉపాధ్యాయులకు బిగ్ షాక్ .. సీఎం మమతా బెనర్జీ ఏమన్నారంటే ..?

sharma somaraju

Lok Sabha Elections 2024: భారీ భద్రత నడుమ మణిపూర్ లో కొనసాగుతున్న రీపోలింగ్

sharma somaraju

Doordarshan: డీడీ న్యూస్ లోగో రంగు మార్పుపై రేగుతున్న దుమారం

sharma somaraju

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

Lok sabha Elections 2024: నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల .. ఏపీ, తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం

sharma somaraju

Ayodhya: అయోధ్య రామాలయంలో అద్భుత దృశ్యం .. సూర్య తిలకాన్ని దర్శించి తరించిన భక్తులు

sharma somaraju

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు సుప్రీం కోర్టులో దక్కని ఊరట

sharma somaraju

Lok Sabha Elections: అస్సాంలోని ఈ పెద్ద కుటుంబంలో 350 మంది ఓటర్లు ..ఆ కుటుంబ ఓట్ల కోసం అభ్యర్ధుల ప్రయత్నాలు

sharma somaraju

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Lok sabha Elections 2024: ప్రధాని మోడీ విమర్శలపై ఘాటుగా స్పందించిన మల్లికార్జున ఖర్గే .. రిప్లై ఇలా..

sharma somaraju