NewsOrbit
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

Viral Video: ఛత్తీస్‌గడ్‌లో అమానవీయ ఘటన ..! సర్పంచ్‌తో సహా పది మందిపై అట్రాసిటీ కేసు..!!

Viral Video: ఎక్కడైనా నేరం జరిగితే బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయాలి. వారు విచారణ జరిపి నేరానికి పాల్పడిన వారిని అరెస్టు చేసి జైలుకు పంపుతారు. అయితే గ్రామీణ ప్రాంతాల్లో పలు చోట్ల ఇంకా ప్రైవేటు పంచాయతీలు నిర్వహిస్తూ గ్రామ పెద్దలే నేరాలకు శిక్ష వేయడం, జరిమానాలు విధించడం లాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. కొన్ని చోట్ల అయితే మరీ దారుణమైన శిక్షలను అమలు చేస్తున్నారు. చత్తీస్‌గడ్ లో అమానవీయ పద్ధతిలో గ్రామ పెద్దలు శిక్ష అమలు చేసిన ఓ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Viral Video: Inhumane incident in Chhattisgarh
Viral Video Inhumane incident in Chhattisgarh

విషయంలోకి వెళితే ..బల్ రామ్‌పుర్ – రామానుజ్ గంజ్ జిల్లాలోని చెరా గ్రామ పరిధిలో అమానవీయ ఘటన జరిగింది. చెరువులో చేపలను దొంగతనం చేశారని ఆరోపిస్తూ పాండో గిరిజన తెగకు చెందిన 8మందిని చెట్టుకు కట్టేసి కొట్టారు. ఈ ఘటన జూన్ 15న జరిగింది. అయితే దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పోలీసులు స్పందించారు. చేపల దొంగతనం చేశారన్న అభియోగంపై 8 మందిని గ్రామ పంచాయతీ కార్యాలయానికి పిలిపించారు. సర్పంచ్ తో సహా గ్రామ పెద్దలు గ్రామ పంచాయతీలోనే తీర్పు ఇచ్చారు. దండనతో పాటు ఒక్కొక్కరికి రూ.35 వేల జరిమానాను విధించారు. ఈ అఘాయిత్యాన్ని గ్రామస్తులు చూస్తున్నా ఎవరూ నోరు మెదపలేదు.

Viral Video: Inhumane incident in Chhattisgarh
Viral Video Inhumane incident in Chhattisgarh

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. సర్పంచ్ సహా గ్రామ పెద్దలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ తో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు అడిషనల్ ఎస్పీ  ప్రశాంత్ కట్లామ్ తెలిపారు. పది మందిని అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు.

ఫోటోలు..ఎఎన్ఐ సౌజన్యంతో..

author avatar
sharma somaraju Content Editor

Related posts

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

Lok sabha Elections 2024: నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల .. ఏపీ, తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం

sharma somaraju