NewsOrbit
Featured జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

West Bengal : ఎలక్ట్రిక్ స్టూటర్‌పై సచివాలయానికి సీఎం మమతా బెనర్జీ..! ఎందుకంటే..?

West Bengal : దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. దీనికి తోడు వంట గ్యాస్ ధరలు భారీగా పెరిగాయి. నెల రోజుల వ్యవధిలో సిలెండర్ కు వంద రూపాయల వరకూ ధర పెరిగిన సంగతి తెలిసిందే. కొన్ని రాష్ట్రాల్లో పెట్రోల్ ధర లీటరు వంద రూపాయల మార్క్ దాటేసింది. కేంద్ర ప్రభుత్వం కొత్తగా సెస్ ను విధించడం వల్ల ఏప్రిల్ ఒకటవ తేదీ నుండి ఇంధన ధరలు మరింత పెరిగే ప్రమాదం ఉందని ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.

West Bengal cm mamata benarjee protest on petro price hike
West Bengal cm mamata benarjee protest on petro price hike

ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గురువారం వినూత్న రీతిలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఎలక్ట్రిక్ స్కూటర్‌పై కోల్‌కతాలో ఆమె చక్కర్లు కొట్టి నిరసన తెలిపారు. తొలుత మమతా బెనర్జీ..పెట్రోల్, డీజిల్ పై రాష్ట్ర ప్రభుత్వం విధిస్తోన్న వ్యాట్ ఒక్క రూపాయి తగ్గిస్తూ నిర్ణయాన్ని తీసుకున్నారు. అనంతరం నిరసన ప్రదర్శనలో ఆమె పాల్గొన్నారు. తన నివాసం నుండి సచివాలయం వరకూ ఎలక్ట్రిక్ బైక్ పై ప్రయాణించారు. పార్టీ సీనియర్ నేత ఒకరు ఈ బైక్ నడుపుతుండగా ఆమె వెనుక కూర్చున్నారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై నిరసనగా ఓ బోర్డును మెడలో వేలాడ దీసుకున్నారు. ఈ వీడియోను మమత బెనర్జీ తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్టు చేశారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది.

కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశాన్ని లూటీ చేస్తుందని విమర్శించారు. పెట్రోల్, డీజిల్ మాత్రమే కాదు పేదవాడికి అందుబాటులో ఉండే కిరోసిన్ ధరలను కూడా ప్రభుత్వం పెంచిందని మమత ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థలైన బీఎస్ఎన్ఎల్, సెయిల్, విశాఖ స్టీల్, కోల్ ఇండియా, ఓఎన్జీసి, ఎల్ఐసీ వంటి వాటిని నడిపించడం మోడీ సర్కార్ కు చేతకావడం లేదని దుయ్యబట్టారు.

 

author avatar
sharma somaraju Content Editor

Related posts

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!