Union Budget 2023: కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ 2023 – 24 ను సమర్పించనున్నారు. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు ఉండటంతో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ప్రస్తుత ప్రభుత్వానికి లేదు. ఈ నేపథ్యంలో 2023 – 24 బడ్జెట్ తోనే మోడీ సర్కార్ ఎన్నికలకు సిద్దం కావాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో అయిదు కీలక అంశాలు సర్కార్ నిర్ణయాలపై ప్రజల్లో ఆసక్తి నెలకొంది. సామాన్య, మధ్యతరగతి వర్గాలకు ఊరట ఇస్తూనే ఆదాయాలు పెంచుకునే మార్గంపై కేంద్రం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ప్రపంచం ప్రస్తుతం ఆర్ధిక మాంద్యంలోకి జారుకుంటోంది. భారత్ పరిస్థితి మెరుగ్గా ఉన్నా దీని ప్రభావం కొంతైన దేశ ఆర్ధిక వ్యవస్థపై పడుతుంది. ఇప్పటికే పలు దిగ్గజ కంపెనీలు ఉద్యోగాల్లో కోతలు మొదలు పెట్టాయి. దీంతో ప్రజల వ్యయ శక్తి తగ్గి ప్రభుత్వ ఆదాయం తగ్గనున్నది.

ఈ క్రమంలో ఎక్కడా అభివృద్ధికి బ్రేకులు పడకుండా ప్రజలపై భారం వేయకుండా ఆర్ధిక వ్యవస్థను ముందుకు తీసుకువెళ్లడం మోడీ సర్కార్ కు కత్తిమీద సాములా మారనున్నది. ప్రభుత్వం వ్యయ నియంత్రణ ఎక్కడా బ్యాలెన్స్ తప్పినా ద్రవ్య లోటు పెరిగిపోయే ప్రమాదం ఉంది. అప్పుడు మార్కెట్ నుండి కేంద్రం నిధులు సమీకరించాల్సిన పరిస్థితి నెలకొంటుంది. ఇది వడ్డీ రేట్లపై ప్రతికూల ప్రభావం చూపించవచ్చు. ఫలితంగా ద్రవ్యోల్బణం అదుపుతప్పే ప్రమాదం ఉంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం 2023 ఏప్రిల్ 1 నుండి కేంద్రం ద్రవ్యలోటును 50 బేసిస్ పాయింట్లు తగ్గించవచ్చు. భారత్ తన జీడీపీలో 5.9 శాతం గా నిర్దారించే అవకాశాలు ఉన్నాయి. ఇది పూర్తి స్థాయి బడ్జెట్ కావడంతో అభివృద్ధి పనులు ఆపకుండానే ఈ సారి సంక్షేమ పథకాలపై దృష్టి పెట్టే అవకాశం ఉంది. ఈ క్రమంలో గ్రామీణ పథకాలు, హౌసింగ్ పై ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించే అవకాశం ఉంది. బడ్జెట్ అనగానే మద్యతరగతి వర్గాలు ప్రత్యక్ష్యంగా లేదా పరోక్షంగా తమకు ఏమైనా ఉపశమనం కలుగుతుందా అని ఎదురుచూస్తుంటారు. ఆదాయపన్ను స్లాబ్ ల సవరణ, ఆదాయపన్ను రేట్లు, స్టాండర్డ్ డిడక్షన్ ల పెంపుదల, సెక్షన్ 80సీ, 80 డీ పరిమితులు, గృహోపకరణాలపై సబ్సిడీలు వంటి వాటికి ప్రజలు ఎదురుచూస్తున్నారు.

Union Budget 2023: పన్ను స్లాబ్
ప్రస్తుత పన్ను స్లాబ్ లో వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు రూ.2.5 లక్షల ప్రాధమిక మినహాయింపు పరిమితి ఉంది. దీని అర్ధం ఈ పరిమితి కంటే తక్కువ ఆదాయం ఉన్న వ్యక్తులు అదాయ పన్ను రిటర్న్ లను దాఖలు చేయవలసిన అవసరం లేదు. అయితే 2014 – 15 లో పెట్టిన ఈ నిబంధనల్లో ఎటువంటి మార్పులు చేయలేదు. చిరు ఉద్యోగులకు పెరుగుతున్న ఖర్చులకు సరిపడా మాత్రమే జీతాలు పెరిగినా ఆమేరకు పన్ను పోటు కూడా పెరుగుతూ వస్తొంది. తాజాగా అంతర్జాతీయ పరిణామాల కారణంగా ఇంథనం, ఆహార ధరల వృద్ధితో ద్రవ్యోల్బణం భారీగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో బడ్జెట్ లో పన్ను లేని ఆదాయ పరిమితిని కేంద్రం రూ.5 లక్షల నుండి పది లక్షల వరకూ పెంచుతుందన్న అంచనాలు ఉన్నాయి.
Budget 2023: ప్రామాణిక తగ్గింపు (స్టాండర్డ్ డిడక్షన్)
అదాయపన్ను లెక్కింపులో కీలకమైన స్టాండర్డ్ డిడక్షన్ (ప్రామాణిక తగ్గింపు) పై కూడా చాలా రోజులుగా అసంతృప్తి నెలకొని ఉంది. ప్రస్తుతం స్టాండర్డ్ డిడక్షన్ రూ.50వేలుగా ఉంది. దీనిని కనీసం లక్షకు రెట్టింపు చేసే అవకాశం ఉందని పన్ను చెల్లింపుదారులు భావిస్తున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం పెరుగుతున్న జీవన వ్యయం, పెరుగుతున్న ద్రవ్యోల్బణం కోసం ప్రామాణిక మినహాయింపు పరిమితిని రెట్టింపు చేయాలన్న వాదన ఉంది.
What to expect from Union Budget 2023: సెక్షన్ 24 బీ పరిమితి
అంతే కాకుండా గృహ రుణాలపై చెల్లించే వడ్డీకి ఇప్పటి వరకూ ఆదాయపన్ను చట్టం సెక్షన్ 24 (బీ) ప్రకారం మినహాయింపు లభిస్తుంది. దీనికి అత్యధికంగా రూ.2లక్షల వరకూ మినహాయింపు లభిస్తొంది. కోవిడ్ తర్వాత రియల్ ఎస్టేట్ మార్కెట్ పుంజుకున్నది. ఇళ్ల రేట్ల ధరలు ఏటా కనీసం 3.5 శాతం చొప్పున పెరిగాయి. మరో పక్క వడ్డీ రేట్లు కూడా పెరిగాయి. కోవిడ్ సమయంలో 6.5 వద్ద ఉన్న వడ్డీ రేటు 8.5 దాటేసింది. దీంతో వినియోగదారులపై చెల్లింపుల భారం కూడా పెరిగింది. ఈ సమయంలో సెక్షన్ 24 (బి) పరిధిని కూడా పెంచాల్సిన అవసరం ఉంది. 2024 పార్లమెంట్ ఎన్నికలకు ముందు ప్రవేశ పెట్టే పూర్తి స్థాయి బడ్జెట్ కావడంతో ప్రభుత్వం భారీ మౌళిక వసతుల ప్రాజెక్టులను ప్రకటించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. భవిష్యత్తులో చేపట్టే ప్రాజెక్టులకు సంబంధించిన ప్రకటనలు ఈ బడ్జెట్ లో ఉంటాయని భావిస్తున్నారు.
Union Budget 2023, Budget 2023, Budget 2023 Expectations, Key points from Budget 2023, Union Budget Finance Minister, Central Government Budget 2023, Budget Bill 2023, Budget Expectations 2023, 2023 Budget